DNN SPORTS NEWS – విశాఖపట్నం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అండర్-11 ఓపెన్ & బాలికల చెస్ ఛాంపియన్షిప్-2026 ఘన ప్రారంభం
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అండర్-11 ఓపెన్ మరియు బాలికల చెస్ ఛాంపియన్షిప్-2026 ఉత్సాహభరితంగా ప్రారంభమైంది. మణి చెస్ అకాడమీ ఆధ్వర్యంలో, ఆల్ విశాఖ చెస్ అసోసియేషన్ (AVCA) మరియు ఆంధ్రా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మక పోటీలకు రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి చిన్నారులు తరలివచ్చారు.
ఈ ఛాంపియన్‌షిప్‌లో ఓపెన్ (బాయ్స్) విభాగంలో 119 మంది, బాలికల విభాగంలో 68 మంది క్రీడాకారులు పోటీపడుతున్నారు. వీరిలో ఓపెన్‌లో 47 మంది, బాలికల్లో 12 మంది ఇంటర్నేషనల్ రేటెడ్ ప్లేయర్లు ఉన్నారు. ప్రతి విభాగంలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన వారు ఆగస్టు 2 నుంచి మంగళూరులో జరగనున్న జాతీయ అండర్-11 చెస్ ఛాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహిస్తారు.
మూడు రౌండ్ల తర్వాత స్కోర్ బోర్డ్ వివరాలను చీఫ్ ఆర్బిటర్ G.V. కుమార్ గారు DNN SPORTS న్యూస్ కు అధికారికంగా ప్రకటించారు
ఓపెన్ విభాగం (3/3 పాయింట్లు):
పిడుగు సంజయ్ (అనంతపురం)
ఎం. శ్రీ సాకేత్ (అనంతపురం)
డి. రోషన్ (ఎన్టీఆర్ జిల్లా)
ఎ. సౌర్జయేష్ (విశాఖపట్నం)
పి. శ్రీలక్ష్మి కార్తికేయ (గుంటూరు)
హితేష్ వి (ఎస్పీఎస్ఆర్ నెల్లూరు)
కార్తికేయ ఎ (కాకినాడ)
ప్రేరణ్ కార్తీక్ (విశాఖపట్నం)
అల్లు సృజయ్ (విశాఖపట్నం)
బాలికల విభాగం (3/3 పాయింట్లు):
అనన్య చింతా (తూర్పు గోదావరి)
బి. షాన్వి (కోనసీమ)
జి. షారన్ బ్లెస్సీ (అనంతపురం)
కె. నిత్యశ్రీ (తిరుపతి)
శరణ్య శ్రీ (విశాఖపట్నం)
లాస్యశ్రీ (ప్రకాశం)
ప్రారంభోత్సవం
ఛాంపియన్‌షిప్‌ను ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీమతి అడుసుమిల్లి సునీత గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బివికె కళాశాల ప్రిన్సిపాల్ సంయుక్త, ఆంధ్రా చెస్ అసోసియేషన్ అధ్యక్షులు ఎ. సురేష్, ఛైర్మన్ శ్రీ కెవివి శర్మ, ఆల్ విశాఖ చెస్ అసోసియేషన్ కార్యదర్శి శ్రీ ఎస్. మాణిక్యరావు, శ్రీ చెస్ అకాడమీ డైరెక్టర్ వి. శ్రీకాంత్, ఈగల్ డిపార్ట్మెంట్ సీఐ శ్రీమతి కళ్యాణి, బివికె కళాశాల పీడీ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.
ప్రారంభోత్సవంలో భాగంగా శ్రీమతి కళ్యాణి గారి ఆధ్వర్యంలో “డ్రగ్ ఫ్రీ ఇండియా” ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. 500 మందికి పైగా క్రీడాకారులు, తల్లిదండ్రులు, కోచ్‌లు, అధికారులు ఈ ప్రతిజ్ఞలో పాల్గొని మాదకద్రవ్య వ్యతిరేక ఉద్యమానికి మద్దతు తెలిపారు.
—
రిపోర్టర్: కిరణ్ కుమార్ పాలూరి
Fast news కోసం సంప్రదించండి: 9492542247
