CH.S.D. సెయింట్ తెరెసా కళాశాలలో VIT-AP FIDE రేటింగ్ ఏలూరు జిల్లా చెస్ సెలెక్షన్స్ బ్రోచర్ విడుదల
ఏలూరు: ఏలూరు జిల్లా స్థాయి VIT-AP FIDE రేటింగ్ ఏలూరు జిల్లా చెస్ సెలెక్షన్స్ అధికారిక బ్రోచర్‌ను మంగళవారం సెయింట్ తెరెసా మహిళా కళాశాల ప్రిన్సిపాల్ సిస్టర్ డా. మెర్సీ పి ఆవిష్కరించారు. కళాశాల ప్రిన్సిపాల్ ఛాంబర్లో జరిగిన ఈ కార్యక్రమంలో టోర్నమెంట్ డైరెక్టర్ శ్రీమతి ఎస్. శ్యామల, చెస్ డెవలప్మెంట్ అండ్ ప్లేయర్స్ అసోసియేషన్ ఏలూరు జిల్లా అధ్యక్షులు శ్రీ కిరణ్ కుమార్ పాలూరి, కార్యదర్శి శ్రీ కన్నా సూర్య నాగేశ్వరరావు, కోశాధికారి శ్రీ చాగంటి. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సిస్టర్ మెర్సీ మాట్లాడుతూ, “చదరంగం విద్యార్థుల్లో ఏకాగ్రత, సహనం, విశ్లేషణా శక్తిని పెంపొందిస్తుంది. మా కళాశాల చరిత్రలో జిల్లా స్థాయి చెస్ టోర్నమెంట్ జరగడం ఇదే తొలిసారి. ఏలూరు జిల్లాలో ఈ క్రీడను ప్రోత్సహించేందుకు వేదిక ఇవ్వడం మాకు గర్వకారణం. పాల్గొనే ప్రతి క్రీడాకారుడికి నా శుభాకాంక్షలు” అని తెలిపారు.
టోర్నమెంట్ డైరెక్టర్ శ్రీమతి శ్యామల మాట్లాడుతూ, కళాశాల సహకారంతో తొలిసారి ఇంత పెద్ద ఎత్తున పోటీలు నిర్వహిస్తున్నామని, ఇది జిల్లాలోని యువ చెస్ ప్లేయర్లకు, ముఖ్యంగా బాలికలకు స్ఫూర్తినిస్తుందని అన్నారు.
అసోసియేషన్ కార్యదర్శి శ్రీ కన్నా సూర్య నాగేశ్వరరావు, వివరాల ప్రకారం, ఈ టోర్నమెంట్‌కు కనీసం 5 జిల్లాల నుంచి 150 మందికి పైగా క్రీడాకారులు హాజరుకానున్నారు. పోటీలన్నీ సెయింట్ తెరెసా కళాశాల ప్రాంగణంలోనే నిర్వహించనుండగా, ఆట హాలు, అర్బిటర్లు, ఇతర ఏర్పాట్లను కళాశాల యాజమాన్యం పర్యవేక్షణలో పూర్తి చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
జిల్లా అధ్యక్షులు శ్రీ కిరణ్ కుమార్ పాలూరి టోర్నమెంట్ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.
— DNN న్యూస్ డెస్క్, ఏలూరు
