తాడేపల్లిగూడెంలో ఘనంగా వెస్ట్ గోదావరి జిల్లా అండర్-13 ఓపెన్ & గర్ల్స్ చెస్ ఛాంపియన్షిప్ – 2026
తాడేపల్లిగూడెం, మే 20: ఆంధ్ర చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, మాస్టర్స్ చెస్ అకాడమీ, తాడేపల్లిగూడెం నిర్వహణలో, ఐరిస్ ఫ్లోరెస్ట్స్ ది హ్యాపీ స్కూల్ స్పాన్సర్‌షిప్‌తో వెస్ట్ గోదావరి జిల్లా అండర్-13 ఓపెన్ & గర్ల్స్ చెస్ ఛాంపియన్షిప్ – 2026 పోటీలు తాడేపల్లిగూడెంలోని IRIS Florets The Happy School లో ఘనంగా నిర్వహించబడ్డాయి.
ఈ పోటీలు ఉదయం పదిన్నర గంటలకు ప్రారంభమయ్యాయి. IRIS FLORETS THE HAPPY SCHOOL డైరెక్టర్లు ఎం. గాయత్రి రెడ్డి మరియు సాయికుమార్ తొలి ఎత్తు వేసి పోటీలను ప్రారంభించారు. 
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తాడేపల్లిగూడెం బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఈతకోట భీమశంకర్ రావు (తాతాజీ) గెలుపొందిన క్రీడాకారులను అభినందించి ప్రశంసాపత్రాలు అందజేశారు. క్రీడాకారుల ప్రతిభను కొనియాడుతూ భవిష్యత్తులో రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు.
జిల్లా నలుమూలల నుండి సుమారు 60 మంది క్రీడాకారులు ఈ పోటీలలో పాల్గొని ప్రతిభ కనబరిచారు.
విజేతలు:
ఓపెన్ విభాగం:
1వ స్థానం: సాత్విక్ రుత్విక్ వెంకట కార్తికేయ రెడ్డి
2వ స్థానం: కాశ్యప్

గర్ల్స్ విభాగం:
1వ స్థానం: సన్నిహిత వాసిరెడ్డి
2వ స్థానం: మోక్షశ్రీ హంస మల్లిడి

మొదటి రెండు స్థానాలు సాధించిన క్రీడాకారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అండర్-13 చెస్ ఛాంపియన్‌షిప్‌కు ఎంపిక కాబడతారని నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు పపాలూరి కిరణ్ కుమార్ చీఫ్ ఆర్బిటర్‌గా వ్యవహరించారు. వెస్ట్ గోదావరి జిల్లా టోర్నమెంట్ కమిటీ సభ్యులు శ్రీ జె. రాంబాబు, ఆర్బిటర్‌గా, శ్రీ ఎల్. అరవింద బాబు, శ్రీమతి ఐ. ఉమా మహేశ్వరి, శ్రీ ఆర్. అమర్నాథ్, ఎస్. నాగేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నిర్వాహకులు చంద్రశేఖర్ (మాస్టర్స్ చెస్ అకాడమీ) పోటీలను విజయవంతం చేసిన క్రీడాకారులు, తల్లిదండ్రులు, ఆర్బిటర్లు మరియు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
