DNN Kids World, Tue, 2, June, 2026
ఒకరోజు రాము తన ఇంటి ముందు కూర్చొని ఉన్నాడు.
అప్పుడే ఒక చిన్న చీమ పెద్ద బియ్యం గింజను మోసుకుంటూ వెళ్తోంది. గింజ చాలా బరువుగా ఉండటంతో చీమ పలుమార్లు కిందపడింది.
అది చూసిన రాము, “ఇంత చిన్నదానివి… ఆ గింజను ఎందుకు మోస్తున్నావు?” అని అడిగాడు.
చీమ నవ్వుతూ, “ఈరోజు కష్టపడితే రేపు సుఖంగా ఉంటాను” అని చెప్పింది.
ఆ మాట విన్న రాము కూడా తన పనులు సమయానికి చేసుకోవడం ప్రారంభించాడు.
నీతి
కష్టపడేవారికే విజయం దక్కుతుంది.
Story By – Kushi & Pandu | ఏలూరు 🏡🌈
