🌈 చిన్నారి ప్రపంచం ✍️ రచన: 👧 కుషి (KUSHI) | 👦 పండు (PANDU) 📍 ఏలూరు (Eluru) 🏡 "చదువుతూ... నవ్వుతూ... నేర్చుకుందాం!" 📚✨
🌈 చిన్నారి ప్రపంచం ✍️ రచన: 👧 కుషి (KUSHI) | 👦 పండు (PANDU) 📍 ఏలూరు (Eluru) 🏡 "చదువుతూ... నవ్వుతూ... నేర్చుకుందాం!" 📚✨
ఒక అడవిలో ఒక చిలుక ఉండేది. ఒక రోజు వేటగాడు వల వేసి పక్షులను పట్టుకోవాలని చూశాడు. చిలుక అది గమనించి మిగతా పక్షులందరికీ హెచ్చరించింది. అన్ని పక్షులు కలిసి ఒకేసారి ఎగిరిపోవడంతో వల కూడా వాటితో పాటు పైకి లేచింది. వేటగాడు ఆశ్చర్యపోయాడు.
నీతి: ఐకమత్యమే మహాబలం.
ప్రశ్న: కాళ్లు లేవు కానీ నడుస్తుంది, నోరు లేదు కానీ మాట్లాడుతుంది. అది ఏమిటి?
జవాబు: గడియారం
🐘 ఏనుగు తన తొండంతో 300 కిలోల వరకు బరువును ఎత్తగలదు!
🦒 జిరాఫీ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన జంతువు.
🐙 ఆక్టోపస్‌కు మూడు గుండెలు ఉంటాయి.
🦋 సీతాకోకచిలుక తన కాళ్లతో రుచి తెలుసుకుంటుంది.
🌎 భూమి సూర్యుడి చుట్టూ ఒకసారి తిరగడానికి 365 రోజులు పడుతుంది.
🐝 తేనెటీగలు తమ రెక్కలను సెకనుకు 200 సార్లకు పైగా కదిలిస్తాయి.
టీచర్: నువ్వు స్కూల్‌కి ఎందుకు ఆలస్యంగా వచ్చావు?
విద్యార్థి: రోడ్డుపై “నెమ్మదిగా వెళ్లండి” అని బోర్డు పెట్టారు కదా మేడం!
🌈 చిన్నారి ప్రపంచం
✍️ రచన: 👧 కుషి (KUSHI) | 👦 పండు (PANDU)
📍 ఏలూరు (Eluru) 🏡 “చదువుతూ… నవ్వుతూ… నేర్చుకుందాం!” 📚✨
