📍 జగిత్యాల | జూన్ 10, 2026 | బుధవారం | DNN NEWS
తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి (TGBIE) 2026 మే/జూన్ నెలల్లో నిర్వహించిన ఇంటర్ మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం (జనరల్ & వొకేషనల్) అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను జూన్ 11, 2026న ఉదయం 11:30 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
ఫలితాలను విద్యార్థులు ఆన్లైన్లో తమ హాల్టికెట్ నంబర్ ద్వారా చూసుకోవచ్చు.
ఫలితాలు అందుబాటులో ఉండే వెబ్సైట్లు
🔹 tgbie.cgg.gov.in
🔹results.cgg.gov.in
పరీక్షలకు హాజరైన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అధికారిక వెబ్సైట్ల ద్వారా ఫలితాలను పరిశీలించుకోవాలని అధికారులు సూచించారు.
🖋️ DNN NEWS రిపోర్టర్ మొహమ్మద్ సల్మాన్
📍 జగిత్యాల జిల్లా
🌐 DNN NEWS – ప్రజల గొంతుక
