జంగారెడ్డిగూడెంలో రేపు ఎలూరు జిల్లా అండర్-15 చెస్ ఎంపికలు
అండర్-15 చెస్ ఛాంపియన్ల వేటకు జంగారెడ్డిగూడెం సిద్ధం ఏలూరు జిల్లా చెస్ సెలెక్షన్స్కు రంగం సిద్ధం
📍 జంగారెడ్డిగూడెం | జూన్ 11, 2026 | DNN NEWS
ఏలూరు జిల్లా అండర్-15 చెస్ ఎంపికల పోటీలు రేపు
ఏలూరు జిల్లా చెస్ అభివృద్ధి మరియు క్రీడాకారుల సంఘం (CDPAED) ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా అండర్-15 ఓపెన్ మరియు బాలికల చెస్ ఎంపికల పోటీలు జూన్ 12, 2026 (శుక్రవారం) నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ పోటీలను శ్రీ హంసా చెస్ అకాడమీ నిర్వహిస్తుండగా, ఆంధ్ర చెస్ అసోసియేషన్ అనుమతితో నిర్వహిస్తున్నారు. పోటీలు జంగారెడ్డిగూడెంలోని త్రివేణి పబ్లిక్ స్కూల్ ప్రాంగణంలో జరగనున్నాయి.
ఈ పోటీల్లో 2011 జనవరి 1 లేదా ఆ తర్వాత జన్మించిన బాలురు, బాలికలు పాల్గొనవచ్చు. ప్రవేశ రుసుము రూ.300గా నిర్ణయించారు. పోటీల ద్వారా ఎంపికయ్యే టాప్-4 బాలురు మరియు టాప్-4 బాలికలు ఏలూరు జిల్లా తరఫున రాష్ట్ర స్థాయి అండర్-15 చెస్ ఛాంపియన్షిప్లో ప్రాతినిధ్యం వహించనున్నారు.
పాల్గొనే విద్యార్థులు తప్పనిసరిగా జనన ధృవీకరణ పత్రం (Birth Certificate) సమర్పించాలని నిర్వాహకులు సూచించారు. పాఠశాల ధృవీకరణ పత్రాలు అంగీకరించబడవని తెలిపారు.
జిల్లాలోని చెస్ క్రీడాకారులు, తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పెద్ద సంఖ్యలో పాల్గొనాలని నిర్వాహకులు కోరారు.
📞 మరిన్ని వివరాలకు:
అన్నవరపు సురేఖ (టోర్నమెంట్ డైరెక్టర్)
📱 80199 92505, 95426 42505
🖋️ DNN NEWS జంగారెడ్డిగూడెం
📍 ఏలూరు జిల్లా
🌐 DNN NEWS – ప్రజల గొంతుక
