అమ్మ మాట – అంగన్వాడి బాట… బడి బాట – భవిష్యత్తు బాట
అంగన్వాడీ కేంద్రాల ప్రాధాన్యంపై అవగాహన ర్యాలీ నిర్వహణ
📍 జగిత్యాల | జూన్ 15, 2026 | సోమవారం | DNN NEWS
ఐసీడీఎస్ ప్రాజెక్టు జగిత్యాల అర్బన్-2 సెక్టార్ పరిధిలోని చింతకుంటవాడ అంగన్వాడీ కేంద్రంలో “అమ్మ మాట – అంగన్వాడి బాట… బడి బాట – భవిష్యత్తు బాట” కార్యక్రమాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు.
వార్డు కౌన్సిలర్ బడుగు పద్మ రాజేందర్ అధ్యక్షతన, అంగన్వాడీ సూపర్వైజర్ మమత ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రెండున్నర సంవత్సరాల నుండి ఆరు సంవత్సరాల వయస్సు గల చిన్నారులను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించాలని అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రాల ప్రాముఖ్యతను వివరిస్తూ స్లోగన్లతో ర్యాలీ నిర్వహించారు. చిన్నారుల మానసిక, శారీరక, మేధో మరియు భాషా వికాసానికి అంగన్వాడీ కేంద్రాలు ఎంతో ఉపయోగపడతాయని తల్లిదండ్రులకు వివరించారు.

అంగన్వాడీ కేంద్రాల్లో మంచి అలవాట్లు, కథలు, పాటలు, సృజనాత్మక కార్యక్రమాలు, ఆటల ద్వారా అభ్యాసం, పోషకాహారం, ఆరోగ్య పరిరక్షణ వంటి అంశాలు అందించబడుతున్నాయని తెలిపారు. అలాగే కేంద్రాల పరిశుభ్రత, ఆకర్షణీయమైన అలంకరణ, పెరటి తోటల పెంపకం, పిల్లలకు స్నేహపూర్వక వాతావరణం కల్పిస్తున్నట్లు వివరించారు.
“ఆటలు పాటలు మెదస్సుకు బాటలు – అక్షరాల బాటలో అభ్యాసం, పోషణ – ఆరోగ్యం బలమైన భవిష్యత్తు” అనే సందేశంతో తల్లుల్లో అవగాహన పెంపొందించారు.
ఈ కార్యక్రమంలో వార్డు ఆఫీసర్ సంతోష్, ఆర్పీ విమల, గర్భిణీలు, బాలింతలు, తల్లులు, కిశోర బాలికలు, చిన్నారులు, అంగన్వాడీ టీచర్లు ఇంద్రజ, జ్యోతి, లక్ష్మి, రాధిక, కల్పన, సుధారాణి, గంగాభవాని తదితరులు పాల్గొన్నారు.
🖋️ DNN NEWS రిపోర్టర్ రియాజ్
📍 జగిత్యాల
🌐 DNN NEWS – ప్రజల గొంతుక
