ఉపాధ్యాయుల గురించి చులకనగా మాట్లాడేవారికి…
నేడు కొందరు ఉపాధ్యాయుల గురించి అవగాహన లేకుండా విమర్శలు చేయడం, చులకనగా మాట్లాడటం బాధాకరం. ఒక విషయం గుర్తుంచుకోవాలి… మీరు ఈ రోజు చదవగలుగుతున్నా, రాయగలుగుతున్నా, ఒక పదవిలో ఉన్నా, సమాజంలో గుర్తింపు పొందినా దాని వెనుక ఒక ఉపాధ్యాయుడి శ్రమ, త్యాగం, కృషి తప్పకుండా ఉంటుంది.
ఉపాధ్యాయుడు కేవలం జీతం కోసం పనిచేసే ఉద్యోగి కాదు. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే నిర్మాత. ఒక గురువు ఒక్క విద్యార్థిని తీర్చిదిద్దితే, ఆ విద్యార్థి వందల మందికి ఆదర్శంగా నిలుస్తాడు. అలాంటి గురువులను విమర్శించే ముందు అద్దంలో మనల్ని మనం చూసుకోవాలి.
“గురువును విమర్శించడం చాలా సులభం… కానీ ఒక విద్యార్థి జీవితాన్ని తీర్చిదిద్దడం అంత సులభం కాదు. చాక్ పట్టి బోధించే చేతిని తక్కువగా చూసేవారు, ఆ చేతి వల్లే తాము ఈ స్థాయికి వచ్చామనే నిజాన్ని మర్చిపోతున్నారు.”
ఉపాధ్యాయులను గౌరవించలేని సమాజం అభివృద్ధి చెందదు. గురువులను అవమానించడం అంటే జ్ఞానాన్ని అవమానించడం, విద్యను అవమానించడం, భవిష్యత్తును అవమానించడం. విమర్శలు చేయాలంటే వాస్తవాలు తెలుసుకుని చేయాలి. లేకపోతే అది అజ్ఞానానికి నిదర్శనంగా మిగిలిపోతుంది.
“తల్లిదండ్రులు జన్మనిస్తారు… గురువులు జీవితాన్ని ఇస్తారు. ఆ జీవితాన్ని ఇచ్చిన వారిని అవమానించే హక్కు ఎవరికీ లేదు.”





