SIR ఫారాల స్వీకరణలో వేగం పెంచాలి: సామాజిక కార్యకర్త రియాజుద్దీన్
సామాజిక కార్యకర్త రియాజుద్దీన్ ఆధ్వర్యంలో SIR ఫారాల సమర్పణ
జగిత్యాల, జూలై 14 (DNN న్యూస్): ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (SIR) కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటే ఎన్యూమరేషన్ ఫారాల స్వీకరణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని జగిత్యాల పట్టణ 16వ వార్డు సామాజిక కార్యకర్త రియాజుద్దీన్ కోరారు.
సోమవారం 16వ వార్డుకు చెందిన రియాజుద్దీన్ సతీమణి మిన్హాజ్ ఫాతిమా కుటుంబ సభ్యులు పూర్తి వివరాలతో నింపిన SIR ఫారాలను బూత్ లెవల్ ఆఫీసర్ (BLO) లక్ష్మికు అందజేశారు.
ఈ సందర్భంగా బీఎల్ఓ లక్ష్మి మాట్లాడుతూ, ఈ నెల 24వ తేదీలోపు ప్రతి అర్హ ఓటరు తమ ఎన్యూమరేషన్ ఫారాలను పూర్తిగా నింపి సంబంధిత బీఎల్ఓలకు సమర్పించాలని విజ్ఞప్తి చేశారు. ఓటర్ల వివరాలు సక్రమంగా నమోదు చేయడం ద్వారా ఎన్నికల సంఘం విడుదల చేసే ముసాయిదా ఓటరు జాబితాలో ప్రతి అర్హుడి పేరు నమోదు అయ్యే అవకాశం ఉంటుందని తెలిపారు.
ఓటరు జాబితాలో పేర్లు, చిరునామాలు, కుటుంబ వివరాలు తదితర అంశాలను జాగ్రత్తగా పరిశీలించి ఫారాలను సమర్పించాలని సూచించారు. ఫారాల నింపడంలో ఎలాంటి సందేహాలు ఉన్నా నేరుగా సంప్రదిస్తే అవసరమైన మార్గదర్శకాలు అందజేస్తామని బీఎల్ఓ లక్ష్మి తెలిపారు.
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రజలందరూ సహకరించాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు.
✍️ రిపోర్టర్: రియాజ్ | జగిత్యాల
DNN న్యూస్
