_రేవంత్ రెడ్డి పేరు ఒకే ఎపిక్ (EPIC) నంబర్‌తో రెండు ఓటర్ జాబితాలలో కనిపించడం కేవలం సాంకేతిక లోపం మాత్రమేనని ఈసీ అధికారులు స్పష్టం చేసింది. ఈ మేరకు ఫ్యాక్ట్ చెక్ తెలంగాణ ఓ అధికారిక ప్రకటనను విడుదల చేసింది._
_అయితే, రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియలో భాగంగా ఇలాంటి డూప్లికేట్ ఎంట్రీలను గుర్తించి, ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. భారత ఎన్నికల సంఘం (ECI) నిర్దేశించిన నిబంధనల మేరకు సంబంధిత జిల్లా ఎన్నికల అధికారి (DEO)ఈ సాంకేతిక లోపాన్ని సరిచేస్తారని స్పష్టం చేశారు. ఇక ఒకే ఎపిక్ నంబర్ రెండు వేర్వేరు ఓటరు జాబితాల్లో ఉన్నంత మాత్రాన.. సదరు వ్యక్తికి రెండు నియోజకవర్గాల్లో ఓటు వేసే హక్కు లేదని ఎన్నికల క్లారిటీ ఇచ్చారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ఇలాంటి పొరపాట్లు కామన్ అని వాటన్నింటినీ త్వరలోనే జాబితా నుంచి తొలగిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు పేర్కొన్నారు.
