చావలిపాడు (మండవల్లి మండలం), జూలై 15 (DNN న్యూస్): ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలోని మండవల్లి మండలం చావలిపాడు గ్రామం 17వ బూత్‌లో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR-2006) కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. గ్రామంలో 98 శాతం SIR-2006 ఫారాల నమోదు పూర్తి చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సారథ్యంలో, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్, కైకలూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావు, కైకలూరు నియోజకవర్గ కన్వీనర్ వీరమల్లు నరసింహారావు, మండల టీడీపీ అధ్యక్షుడు వీరిగాని కొండ సూచనల మేరకు నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో యూనిట్ ఇన్చార్జి, కైకలూరు నియోజకవర్గ టీడీపీ నాయకుడు తలారి రాజేష్, గ్రామ టీడీపీ అధ్యక్షుడు తలారి సుబ్రహ్మణ్యం, గ్రామ BLA గూడపాటి లక్ష్మణరావు, BLO గుట్ల వినోద్ కుమార్, కో-కన్వీనర్ తలారి పోతురాజు, తలారి సత్యనారాయణ, తలారి సహదేవుడు, అలాగే టీడీపీ, బీజేపీ, వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ సందర్భంగా గ్రామంలోని ప్రతి అర్హ ఓటరు వివరాలు సక్రమంగా నమోదు కావడానికి ప్రజలు సహకరించినందుకు నాయకులు, అధికారులు గ్రామస్థులకు కృతజ్ఞతలు తెలిపారు.
✍️ DNN న్యూస్ | ఏలూరు జిల్లా బ్యూరో
