జగిత్యాల, జూలై 15 (DNN న్యూస్): జగిత్యాల జిల్లా ఏడుమోటలపల్లి తండాలో గిరిజన కమ్యూనిటీ భవనం నిర్మాణం కోసం ప్రభుత్వ స్థలాన్ని మంజూరు చేయాలని కోరుతూ గిరిజన బంజారా నాయకులు తహసీల్దార్ నిజాముద్దీన్‌కు బుధవారం వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా తహసీల్దార్ నిజాముద్దీన్ వినతిపత్రాన్ని స్వీకరించి సమస్యను పరిశీలించి నిబంధనల మేరకు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం (AIBSS) యువజన జగిత్యాల జిల్లా అధ్యక్షుడు నగావత్ జీవన్ నాయక్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నగావత్ తిరుపతి నాయక్, వార్డు సభ్యుడు నగావత్ లక్ష్మణ్ నాయక్, అలాగే గిరిజన బంజారా పెద్దలు, యువకులు పాల్గొన్నారు.
నాయకులు మాట్లాడుతూ, ఏడుమోటలపల్లి తండాలో గిరిజనుల సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ప్రత్యేక కమ్యూనిటీ భవనం అవసరమని, అందుకోసం ప్రభుత్వం వెంటనే స్థలాన్ని కేటాయించాలని కోరారు.

రిపోటర్ : జీవన్ నాయక్
✍️ DNN న్యూస్ |పెగడపల్లి మండలం | జగిత్యాల జిల్లా
