బొప్పాయి రైతులను నట్టేట ముంచుతున్న వ్యాపారులు: ఏపీ వికలాంగులు పింఛన్‌దార్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జె.ఎన్. ఆంధ్రయ్య
సిండికేట్‌తో ధరలు తగ్గిస్తే బొప్పాయి రవాణాను అడ్డుకుంటామని హెచ్చరిక
రైల్వే కోడూరు, జూలై 17 (DNN న్యూస్): తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం ఉద్యానవన పంటలకు ప్రసిద్ధి చెందిందని, ముఖ్యంగా బొప్పాయి పంటపై ఆధారపడి వేలాది మంది రైతులు జీవిస్తున్నారని ఏపీ వికలాంగులు పింఛన్‌దార్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, బొప్పాయి రైతు జె.ఎన్. ఆంధ్రయ్య తెలిపారు.
శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే బొప్పాయి పండ్లు ఇతర రాష్ట్రాల మార్కెట్లలో కిలో రూ.100కు పైగా విక్రయమవుతున్నప్పటికీ, స్థానిక రైతుల నుంచి వ్యాపారులు కిలోకు కేవలం రూ.25 నుంచి రూ.30 మాత్రమే చెల్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రైతులకు కనీసం పంట పెట్టుబడి తిరిగి వచ్చేలా న్యాయమైన ధర చెల్లించాలని వ్యాపారులను కోరారు. సిండికేట్‌గా ఏర్పడి ధరలను కృత్రిమంగా తగ్గించి రైతులను నష్టపరిస్తే తీవ్ర స్థాయిలో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
బొప్పాయి రవాణాను అడ్డుకోవడంతో పాటు, రైతులను మోసం చేసే వ్యాపారులపై చట్టపరమైన చర్యలు తీసుకుని కోర్టును ఆశ్రయిస్తామని జె.ఎన్. ఆంధ్రయ్య స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో ఆర్. నరసింహరాజు, ఎం. సుబ్బారాయుడు, కె. పెద్దయ్య నాయుడు, ఎస్. గోపాల్ రాజు, డి. శంకర్ రెడ్డి, కె. రామచంద్ర నాయుడు, మహిళా రైతులు కె. నాగమణి, వి. లక్ష్మమ్మ, రత్నమ్మ, విశ్వనాథ్‌తో పాటు బొప్పాయి, మామిడి రైతులు పాల్గొన్నారు.
✍️ DNN న్యూస్ | తిరుపతి జిల్లా బ్యూరో
