ఈ చిత్రం కేవలం ప్రతీకాత్మక ప్రయోజనం కోసం ఉపయోగించబడింది
DNN Media. Telengana News
One Platform for Employees & Employers
https://jobseek.adoreve.com/
Raiyan Home Solutions
3D Interior Designs
Walk through Animation
Elevations
Etc..
DNN ADS : Advertise with DNN to Grow your Business
Admin Only
ఈ చిత్రం కేవలం ప్రతీకాత్మక ప్రయోజనం కోసం ఉపయోగించబడింది
భీమడోలు, జూన్ 5 (DNN News):
అంగన్వాడీ కేంద్రాలు అందిస్తున్న సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఐసీడీఎస్ భీమడోలు ప్రాజెక్టు గుండుగొలను సెక్టార్ పర్యవేక్షకురాలు ఎం. కవిత కోరారు.
గుండుగొలను నెంబర్-23 అంగన్వాడీ కేంద్రం ఆధ్వర్యంలో గురువారం “అంగన్వాడీ పిలుస్తోంది” కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ వీధుల్లో అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, ప్రజాప్రతినిధులతో కలిసి అవగాహన ర్యాలీ చేపట్టారు. అనంతరం మాట్లాడిన కవిత, చిన్నారుల శారీరక, మానసిక అభివృద్ధికి అంగన్వాడీ సేవలు ఎంతో అవసరమని తెలిపారు.
ముసునూరు మండలంలో నిర్వహించిన కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ, మూడు సంవత్సరాలు నిండిన బాలబాలికలను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించాలని తల్లిదండ్రులకు సూచించారు. గోపవరం, చిల్లబోయినపల్లి, చింతలవల్లి, చెక్కపల్లి, సూరేపల్లి, గుళ్లపూడి తదితర గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించారు.
ఏలూరు నగర పరిధిలోని లంకపేట-2 అంగన్వాడీ కేంద్రంలో స్కూల్ రెడీనెస్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారుల సామాజిక, భాషా, మేధో, శారీరక అభివృద్ధిలో తల్లిదండ్రుల పాత్ర కీలకమని వివరించారు.
పోలవరం మండలంలోని కొండ్రుకోట సెక్టార్లో అంగన్వాడీ పిలుస్తోంది కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సెక్టార్ ఇన్చార్జి సూపర్వైజర్ అంబటి సరస్వతి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రాజెక్ట్ అధికారి కె. సరళ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చిన్నారుల సంక్షేమం, ప్రాథమిక విద్య ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు.
🖋️ రిపోర్టర్: DNN NEWS ప్రతినిధి
📍 భీమడోలు, ఏలూరు జిల్లా
🌐 DNN NEWS – ప్రజల గొంతుక

Comments 0