టోర్నమెంట్ విజేతలకు ట్రోఫీలు, మెడల్స్‌ను డి పాల్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రతినిధులు, ఏలూరు జిల్లా చెస్ అసోసియేషన్ ప్రతినిధులు సంయుక్తంగా ప్రదానం చేసి విజేతలను అభినందించారు.
DNN Media. Telengana News
One Platform for Employees & Employers
https://jobseek.adoreve.com/
Raiyan Home Solutions
3D Interior Designs
Walk through Animation
Elevations
Etc..
DNN ADS : Advertise with DNN to Grow your Business
Admin Only
టోర్నమెంట్ విజేతలకు ట్రోఫీలు, మెడల్స్‌ను డి పాల్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రతినిధులు, ఏలూరు జిల్లా చెస్ అసోసియేషన్ ప్రతినిధులు సంయుక్తంగా ప్రదానం చేసి విజేతలను అభినందించారు.
ఏలూరు| DNN న్యూస్ జూలై 5: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీనియర్ పురుషులు మరియు మహిళల చెస్ ఛాంపియన్షిప్–2026కు ఏలూరు జిల్లా అధికారిక ఎంపికల పోటీలు ఆదివారం దుగ్గిరాలలోని డి పాల్ ఇంటర్నేషనల్ సీబీఎస్ఈ పాఠశాలలో విజయవంతంగా నిర్వహించబడ్డాయి. ఈ పోటీలను టోర్నమెంట్ డైరెక్టర్ శ్రీమతి ఎస్. శ్యామల ఆధ్వర్యంలో నిర్వహించారు.
పోటీలను రెవ. ఫా. నెల్సన్ గారు ప్రారంభించి, పాల్గొన్న క్రీడాకారులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు.
ఏలూరు జిల్లా నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో చెస్ క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. సీనియర్ పురుషుల విభాగంలో నాలుగు రౌండ్లు, సీనియర్ మహిళల విభాగంలో మూడు రౌండ్లు నిర్వహించగా, క్రీడాకారులు ఉత్కంఠభరితమైన పోటీలతో ఆకట్టుకున్నారు.
సీనియర్ పురుషుల విభాగంలో చింత నాగబాబు 4 పాయింట్లతో ప్రథమ స్థానం, జూలపల్లి అక్షిత్ 4 పాయింట్లతో ద్వితీయ స్థానం, వినయ్ కుమార్ 3 పాయింట్లతో తృతీయ స్థానం, దిశాంత్ 3 పాయింట్లతో చతుర్థ స్థానం సాధించారు.
సీనియర్ మహిళల విభాగంలో సోనాలి శ్రీమణి కార్తిక 3 పాయింట్లతో ప్రథమ స్థానం, లెబోనా రాజ్ ఎస్ 2½ పాయింట్లతో ద్వితీయ స్థానం, సాత్విక నాగసాయి 2 పాయింట్లతో తృతీయ స్థానం, ఎ. తేజస్విని 2 పాయింట్లతో చతుర్థ స్థానం దక్కించుకున్నారు.
సాయంత్రం జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో రెవ. ఫా. రోని గారు, బ్రదర్ అజిత్ గారు, టోర్నమెంట్ డైరెక్టర్ శ్రీమతి ఎస్. శ్యామల గారు, ఏలూరు జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ కిరణ్ కుమార్ పాలూరి, కార్యదర్శి శ్రీ కె.ఎస్. నాగేశ్వరరావు గారు పాల్గొని విజేతలకు ట్రోఫీలు, పతకాలు అందజేశారు. పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులను అభినందించారు.
ఈ పోటీల్లో విజేతలైన సీనియర్ పురుషులు, మహిళలు త్వరలో జరిగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీనియర్ చెస్ ఛాంపియన్షిప్–2026లో ఏలూరు జిల్లాకు ప్రాతినిధ్యం వహించనున్నారని చీఫ్ ఆర్బిటర్‌గా వ్యవహరించిన శ్రీ కిరణ్ కుమార్ DNN News కు తెలియజేశారు.
ఈ సందర్భంగా టోర్నమెంట్ డైరెక్టర్ శ్రీమతి ఎస్. శ్యామల మాట్లాడుతూ, పోటీల విజయవంతమైన నిర్వహణకు సహకరించిన దే పాల్ ఇంటర్నేషనల్ సీబీఎస్ఈ పాఠశాల యాజమాన్యానికి, ముఖ్య అతిథులకు, ఏలూరు జిల్లా చెస్ అసోసియేషన్ ప్రతినిధులకు, ఆర్బిటర్లకు, వాలంటీర్లకు, క్రీడాకారులకు మరియు తల్లిదండ్రులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

Comments 0