10 Sep 2026 • 5:05 AM
67Views
Telangana
Sept. 10, 2026
Reported by Aravind Babu Valimi
DNN Media. Telengana News
DNN Media. Telengana News
One Platform for Employees & Employers
https://jobseek.adoreve.com/
Raiyan Home Solutions
3D Interior Designs
Walk through Animation
Elevations
Etc..
DNN ADS : Advertise with DNN to Grow your Business
Admin Only
📍 కైకలూరు నియోజకవర్గం | ముదినేపల్లి మండలం | జూన్ 09, 2026 | మంగళవారం | DNN NEWS
కైకలూరు నియోజకవర్గంలోని ముదినేపల్లి మండలం చినకామనపూడి గ్రామంలో మంగళవారం జరిగిన అగ్నిప్రమాదంలో తెలుగుదేశం పార్టీ మండల ప్రధాన కార్యదర్శి నున్న సాయి నివాస గృహం ప్రమాదవశాత్తు అగ్నికి ఆహుతైంది.

అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ కైకలూరు నియోజకవర్గ కో-కన్వీనర్ కొడాలి వినోద్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు.

ఈ సందర్భంగా కొడాలి వినోద్ మాట్లాడుతూ, ప్రమాదంలో నష్టపోయిన నున్న సాయి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కుటుంబ సభ్యులకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తామని భరోసా కల్పించారు.
అగ్నిప్రమాదానికి గల కారణాలపై స్థానిక అధికారులు విచారణ చేపట్టినట్లు సమాచారం.
🖋️ DNN NEWS ప్రతినిధి
📍 కైకలూరు నియోజకవర్గం
🌐 DNN NEWS – ప్రజల గొంతుక

Comments 0