అగ్నిప్రమాద బాధితుడు షేక్ ఇస్మాయిల్ కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం అందజేస్తున్న కొయ్యలగూడెం జనసేన నాయకులు.
DNN Media. Telengana News
One Platform for Employees & Employers
https://jobseek.adoreve.com/
Raiyan Home Solutions
3D Interior Designs
Walk through Animation
Elevations
Etc..
DNN ADS : Advertise with DNN to Grow your Business
Admin Only
అగ్నిప్రమాద బాధితుడు షేక్ ఇస్మాయిల్ కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం అందజేస్తున్న కొయ్యలగూడెం జనసేన నాయకులు.
కొయ్యలగూడెం,| జూన్ 7 Sun |DNN న్యూస్:
కొయ్యలగూడెం పట్టణంలోని ఎంఆర్వో కార్యాలయం ఎదురుగా ఉన్న ఓ పాన్ షాప్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నికి ఆహుతై పూర్తిగా దగ్ధమైన ఘటనపై జనసేన నాయకులు వెంటనే స్పందించి మానవత్వాన్ని చాటుకున్నారు.
ఈ విషయం తెలుసుకున్న కొయ్యలగూడెం మండల జనసేన అధ్యక్షుడు తోట రవి ఆధ్వర్యంలో జనసేన నాయకులు, జనసైనికులు బాధితుడు షేక్ ఇస్మాయిల్ కుటుంబాన్ని పరామర్శించి, వారికి రూ.20,000 ఆర్థిక సహాయం అందజేశారు.
ఈ సందర్భంగా తోట రవి మాట్లాడుతూ, బాధిత కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉంటుందని, ప్రతి జనసైనికుడు తనకు తోచిన విధంగా సహాయం అందించాలని పిలుపునిచ్చారు. అలాగే ప్రభుత్వం నుంచి లభించే సహాయ సహకారాలను కూడా త్వరితగతిన అందించేలా కృషి చేస్తామని బాధిత కుటుంబానికి భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి ఏపూరి సతీష్, పట్టణ ఉపాధ్యక్షుడు చెప్పుల మధుబాబు, పట్టణ ప్రధాన కార్యదర్శులు మేడిన కన్నయ్య, చవ్వ రాము, సీనియర్ నాయకులు మన్నిడి సాయిబాబ, మట్టా శ్రీనివాస్, కూసుమంచి శ్రీనివాస్ నాయుడు, నక్క బాబి, మడుతూరి శ్రీనివాస్, పూలపల్లి రాజా, గేలం భాస్కర్ రావు, చుక్కల శోభన్ బాబు, ప్రగడ రమేష్, వాడపల్లి రమేష్, గంటా రమేష్, గంటా మురళి, నీలం రాము, మందపాటి రామకృష్ణ, మోదుగు గంగాధర్, దాసరి వినోద్, అమిరిశెట్టి దిలీప్, వెంకటేశ్వరరావు తదితర జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారూ.
🖋️ రిపోర్టర్: DNN న్యూస్ రిపోర్టర్
📍 కొయ్యలగూడెం, ఏలూరు జిల్లా
🌐 DNN NEWS – ప్రజల గొంతుక

Comments 0