టి.నర్సాపురం మండలంలో ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ పంపిణీ చేస్తున్న దాతలు, సామాజిక సేవా కార్యకర్తలు.
DNN Media. Telengana News
One Platform for Employees & Employers
https://jobseek.adoreve.com/
Raiyan Home Solutions
3D Interior Designs
Walk through Animation
Elevations
Etc..
DNN ADS : Advertise with DNN to Grow your Business
Admin Only
టి.నర్సాపురం మండలంలో ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ పంపిణీ చేస్తున్న దాతలు, సామాజిక సేవా కార్యకర్తలు.
టి.నర్సాపురం, |జూన్ 7 Sun|DNN న్యూస్:
మండుతున్న ఎండల్లో కష్టపడి పనిచేస్తున్న ఉపాధి హామీ కూలీలకు దాహార్తి తీర్చేందుకు దాతలు, సామాజిక సేవా కార్యకర్తలు చేపడుతున్న సేవా కార్యక్రమాలు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాయని టి.నర్సాపురం అడిషనల్ ప్రోగ్రాం ఆఫీసర్ (ఏపీఓ) కావూరి నాగేశ్వరరావు అన్నారు.
శనివారం టి.నర్సాపురం మండల ఎంపీడీవో, పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ శ్రీమతి జి. మణికుమారి మరియు ఆమె భర్త బ్రహ్మానందం దంపతుల ఆధ్వర్యంలో పంచాయతీ పరిధిలోని ఎర్రకాలువ, దేవుడు చెరువుల వద్ద పనిచేస్తున్న సుమారు 300 మంది ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏపీఓ కావూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ, గత 35 రోజులుగా సామాజిక కార్యకర్తలు దాతల సహకారంతో ఉపాధి కూలీల కోసం మజ్జిగ, లస్సీ వంటి శీతల పానీయాలు అందిస్తూ దాహార్తిని తీర్చడం అభినందనీయమని కొనియాడారు. సమాజంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తరించాలని ఆకాంక్షించారు.
ఈ సేవా కార్యక్రమానికి సామాజిక కార్యకర్త తాడిగడప జయరాజు సమన్వయకర్తగా వ్యవహరించగా, ఎస్.డి. నాసర్ పాషా, కొరివి శేషారావు, పింగుల మధు, కొరివి నాగేశ్వరరావు, తలకొండ నాగబాబు, బడుగు రాఘవులు, పలకాని పోతురాజు, కొక్కొండ నాగాచారి, డోలా సత్యనారాయణ తదితర సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు.
ఫీల్డ్ అసిస్టెంట్లు బైగాని చందు, శివ, సుప్రియ, వసంత, దుర్గారాణి, సీతామాలక్ష్మి, రవీంద్ర, జొన్నబోయిన కుమారి, వెంకటలక్ష్మి, భార్గవి తదితరులు కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. దాతల సహకారానికి ఉపాధి హామీ కూలీలు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారూ.
🖋️ రిపోర్టర్: DNN న్యూస్ రిపోర్టర్
📍 టి.నర్సాపురం, ఏలూరు జిల్లా
🌐 DNN NEWS – ప్రజల గొంతుక

Comments 0