ఏలూరు కలెక్టరేట్లో కీలక సమీక్షా సమావేశం,ఖరీఫ్ సన్నద్ధతపై అధికారులతో ఇన్చార్జ్ మంత్రి సమీక్ష
DNN Media. Telengana News
One Platform for Employees & Employers
https://jobseek.adoreve.com/
Raiyan Home Solutions
3D Interior Designs
Walk through Animation
Elevations
Etc..
DNN ADS : Advertise with DNN to Grow your Business
Admin Only
ఏలూరు కలెక్టరేట్లో కీలక సమీక్షా సమావేశం,ఖరీఫ్ సన్నద్ధతపై అధికారులతో ఇన్చార్జ్ మంత్రి సమీక్ష
ఏలూరు, జూన్ 5 |DNN News |:
ఏలూరు జిల్లాలో ఈ నెల 5వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటలకు ఏలూరు కలెక్టరేట్లోని గోదావరి సమావేశ మందిరంలో జిల్లా స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు.
ఈ సమావేశానికి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షత వహించనున్నారు. సమావేశంలో ఖరీఫ్-2026 సీజన్‌కు సంబంధించిన సన్నద్ధత చర్యలు, వ్యవసాయ రంగ లక్ష్యాలు, జలధార్ కార్యక్రమం, సూర్యఘర్ యోజన అమలు పురోగతిపై సమీక్ష నిర్వహించనున్నారు.
అదేవిధంగా జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలపై కూడా చర్చ జరగనుంది.
సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, మండల స్థాయి అధికారులు సమావేశానికి హాజరై శాఖల వారీగా పురోగతి నివేదికలను సమర్పించాలని జిల్లా కలెక్టర్ సూచించారు.
జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వేగవంతమైన అమలే ఈ సమీక్షా సమావేశం ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు.
🖋️ రిపోర్టర్: DNN NEWS ప్రతినిధి
📍 ఏలూరు, ఏలూరు జిల్లా
🌐 DNN NEWS – ప్రజల గొంతుక

Comments 0