మార్కెటింగ్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన తోట మాధవిని అభినందిస్తున్న జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి.
DNN Media. Telengana News
One Platform for Employees & Employers
https://jobseek.adoreve.com/
Raiyan Home Solutions
3D Interior Designs
Walk through Animation
Elevations
Etc..
DNN ADS : Advertise with DNN to Grow your Business
Admin Only
మార్కెటింగ్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన తోట మాధవిని అభినందిస్తున్న జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి.
ఏలూరు, జూన్ 5 | DNN News |:
మార్కెటింగ్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్‌గా నియమితులైన తోట మాధవి గురువారం ఏలూరు కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్విని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తోట మాధవికి పుష్పగుచ్ఛం అందజేసి కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు ధాన్యం విక్రయాల విషయంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర అందేలా మార్కెటింగ్ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.
వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌కు సంబంధించిన సమస్యలు, సవాళ్లను పరిష్కరించేందుకు సమన్వయంతో పనిచేయాలని, రైతు సంక్షేమం మరియు మార్కెటింగ్ వ్యవస్థ బలోపేతానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
ఈ సందర్భంగా మార్కెటింగ్ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
🖋️ రిపోర్టర్: DNN NEWS ప్రతినిధి
📍 ఏలూరు, ఏలూరు జిల్లా
🌐 DNN NEWS – ప్రజల గొంతుక

Comments 0