అతివేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో తీవ్ర గాయాలు.. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి
DNN Media. Telengana News
One Platform for Employees & Employers
https://jobseek.adoreve.com/
Raiyan Home Solutions
3D Interior Designs
Walk through Animation
Elevations
Etc..
DNN ADS : Advertise with DNN to Grow your Business
Admin Only
అతివేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో తీవ్ర గాయాలు.. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి
జగిత్యాల జిల్లాలోని వెల్గటూర్ మండలంలో శుక్రవారం విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మండల పరిధిలోని రాజారాంపల్లి క్రాసింగ్ వద్ద నడుచుకుంటూ వెళ్తున్న మహిళను అతివేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో ఆమె మృతి చెందింది.
స్థానికుల వివరాల ప్రకారం, జగిత్యాల నుండి పెద్దపల్లి వైపు వెళ్తున్న లారీ అదుపుతప్పి పత్తిపాక గ్రామానికి చెందిన మునిలతను ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆమెను వెంటనే అంబులెన్స్‌లో కరీంనగర్ ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యలోనే మృతి చెందినట్లు సమాచారం.
ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.
🖋️ రిపోర్టర్: మొహమ్మద్ సల్మాన్
📍 వెల్గటూర్, జగిత్యాల జిల్లా
🌐 DNN NEWS – ప్రజల గొంతుక

Comments 0