"గోదావరి పుష్కరాలకు భారీ ఏర్పాట్లు – రూ.117 కోట్లతో ధర్మపురి అభివృద్ధి"
DNN Media. Telengana News
One Platform for Employees & Employers
https://jobseek.adoreve.com/
Raiyan Home Solutions
3D Interior Designs
Walk through Animation
Elevations
Etc..
DNN ADS : Advertise with DNN to Grow your Business
Admin Only
"గోదావరి పుష్కరాలకు భారీ ఏర్పాట్లు – రూ.117 కోట్లతో ధర్మపురి అభివృద్ధి"
జగిత్యాల జిల్లా, ధర్మపురి:
ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి క్షేత్ర అభివృద్ధి, 2027 గోదావరి పుష్కరాల ఏర్పాట్లలో భాగంగా భూ నిర్వాసితుల అభిప్రాయాలను పూర్తిగా పరిగణనలోకి తీసుకుంటామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు. శనివారం ధర్మపురిలో జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, సంబంధిత అధికారులు, భూ నిర్వాసితులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి మాట్లాడారు.
క్షేత్ర అభివృద్ధి పనుల్లో ఎవరికీ అన్యాయం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, 2017-18 భూసేకరణ చట్టం ప్రకారం అర్హులైన నిర్వాసితులకు న్యాయమైన పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఇప్పటికే భూ నిర్వాసితులతో పలుమార్లు చర్చలు జరిపామని, వారి అభిప్రాయాలను గౌరవిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు.
ధర్మపురి క్షేత్ర అభివృద్ధి రాజకీయాలకు అతీతంగా జరగాల్సిన అవసరం ఉందని మంత్రి అన్నారు. దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు. క్షేత్రాభివృద్ధి కోసం భూములు, ఇళ్లు కోల్పోతున్న వారు పెద్ద మనసుతో సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
2027 జూన్లో జరగనున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్ల కోసం ధర్మపురి, కోటిలింగాల ప్రాంతాలకు తొలి విడతగా రూ.117 కోట్లు కేటాయించినట్లు మంత్రి వెల్లడించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా బైపాస్ రహదారులు, పార్కింగ్ స్థలాలు, పుష్కర ఘాట్ల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. మరిన్ని అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు.
జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ, భూ నిర్వాసితుల అభిప్రాయాలను గౌరవిస్తూ ఆలయ అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు. ప్రభుత్వం అందించే పరిహారం పూర్తిగా పారదర్శకంగా అందజేస్తామని చెప్పారు. పుష్కరాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, ఇప్పటివరకు రూ.117 కోట్ల నిధులు మంజూరైనట్లు వెల్లడించారు.
ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. రాజగౌడ్, ఆర్డీవో మధుసూదన్, ధర్మపురి మున్సిపల్ చైర్మన్ వేముల నాగలక్ష్మి, దేవాదాయ శాఖ అధికారులు, మున్సిపల్ అధికారులు, ఇరిగేషన్ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
🖋️ రిపోర్టర్: మొహమ్మద్ సల్మాన్
📍 ధర్మపురి, జగిత్యాల జిల్లా
🌐 DNN NEWS – ప్రజల గొంతుక

Comments 0