మహిళా రిజర్వేషన్ల అమలుకు ఉద్యమం ఉధృతం, షరతులు లేని మహిళా రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలి, ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య గుంటూరు జిల్లా కార్యదర్శి రెంటాల కుమారి డిమాండ్ చేశారు.
DNN Media. Telengana News
One Platform for Employees & Employers
https://jobseek.adoreve.com/
Raiyan Home Solutions
3D Interior Designs
Walk through Animation
Elevations
Etc..
DNN ADS : Advertise with DNN to Grow your Business
Admin Only
మహిళా రిజర్వేషన్ల అమలుకు ఉద్యమం ఉధృతం, షరతులు లేని మహిళా రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలి, ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య గుంటూరు జిల్లా కార్యదర్శి రెంటాల కుమారి డిమాండ్ చేశారు.
గుంటూరు, జూన్ 5 | DNN News | :
భారత జాతీయ మహిళా సమాఖ్య (ఎన్ఎఫ్ఐడబ్ల్యూ) 72వ వార్షికోత్సవం సందర్భంగా మహిళలకు అన్ని స్థాయిల్లో షరతులు లేని రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య గుంటూరు జిల్లా కార్యదర్శి రెంటాల కుమారి డిమాండ్ చేశారు.
గుంటూరులోని మల్లయ్య లింగం భవన్లో నిర్వహించిన వార్షికోత్సవ కార్యక్రమంలో ఆమె మహిళా సమాఖ్య పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు.
1954లో స్థాపించబడిన భారత జాతీయ మహిళా సమాఖ్య మహిళల హక్కులు, సమానత్వం, సాధికారత కోసం నిరంతరం పోరాటాలు చేస్తూ అనేక చట్టాలు, సంక్షేమ కార్యక్రమాల సాధనలో కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు.
మహిళలకు రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో సమాన అవకాశాలు కల్పించేందుకు మహిళా రిజర్వేషన్ చట్టాన్ని ఎలాంటి షరతులు లేకుండా అమలు చేయాలని ఆమె కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ మహిళలకు పూర్తి స్థాయిలో రక్షణ కల్పించడంలో విఫలమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
మహిళలపై పెరుగుతున్న హింస, వేధింపులు, అత్యాచార ఘటనలను అరికట్టేందుకు కఠినమైన చట్టాలు తీసుకురావడంతో పాటు ఇప్పటికే ఉన్న చట్టాలను సమర్థవంతంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహిళల భద్రత, గౌరవం, హక్కుల పరిరక్షణకు ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని శాఖలు స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు అందజేసి మహిళా రిజర్వేషన్ల అమలుపై ఒత్తిడి తీసుకురావాలని పిలుపునిచ్చారు. మహిళల అభ్యున్నతి, భద్రత, సాధికారత కోసం మహిళా సమాఖ్య పోరాటాలు మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య నగర కార్యదర్శి గుండెబోయిన లక్ష్మి, కోట తిరుపతమ్మ, అప్పమ్మ, కోటేశ్వరమ్మ, చందలూరు విజయలక్ష్మి, కే.సుధా, రాధ, స్వర్ణలత, అన్నమ్మ, రమణమ్మ తదితరులు పాల్గొన్నారు.
🖋️ రిపోర్టర్: DNN NEWS ప్రతినిధి
📍 గుంటూరు, గుంటూరు జిల్లా
🌐 DNN NEWS – ప్రజల గొంతుక

Comments 0