మూలం (Source): అవినీతి నిరోధక శాఖ (ACB) విడుదల చేసిన అధికారిక పత్రికా ప్రకటన (Press Note No. 88, తేదీ: 04-06-2026) ఆధారంగా.
DNN Media. Telengana News
One Platform for Employees & Employers
https://jobseek.adoreve.com/
Raiyan Home Solutions
3D Interior Designs
Walk through Animation
Elevations
Etc..
DNN ADS : Advertise with DNN to Grow your Business
Admin Only
మూలం (Source): అవినీతి నిరోధక శాఖ (ACB) విడుదల చేసిన అధికారిక పత్రికా ప్రకటన (Press Note No. 88, తేదీ: 04-06-2026) ఆధారంగా.
జగిత్యాల, జూన్ 5 (DNN News):
జగిత్యాల జిల్లా కొడిమ్యాల రేంజ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (FRO) గులాం మొయినుద్దీన్‌ను అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు గురువారం లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు.
ACB విడుదల చేసిన ప్రకటన ప్రకారం, కొడిమ్యాల రేంజ్ పరిధిలో 120 టేకు చెట్ల నరికివేతకు అనుమతి మరియు రవాణా పర్మిట్ జారీ చేయడానికి అధికారిక సహాయం చేసినందుకు ఫిర్యాదుదారుని నుంచి లంచం డిమాండ్ చేశారు.
మొదట రూ.2 లక్షల లంచం కోరగా, అందులో రూ.1 లక్షను గత నెలలోనే స్వీకరించినట్లు అధికారులు వెల్లడించారు. అనంతరం మిగిలిన మొత్తాన్ని రూ.80 వేలకు తగ్గించి, గురువారం ఫిర్యాదుదారుని నుంచి స్వీకరిస్తుండగా ACB కరీంనగర్ యూనిట్ అధికారులు వలపన్ని పట్టుకున్నారు.
నిందితుడి కార్యాలయంలోని టేబుల్ డ్రాయర్ నుంచి రూ.80 వేల లంచం నగదును స్వాధీనం చేసుకున్నారు. దీంతో గులాం మొయినుద్దీన్‌ను అదుపులోకి తీసుకుని అరెస్టు చేసి, కరీంనగర్‌లోని ప్రత్యేక ACB కోర్టులో హాజరుపర్చనున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోందని, ఫిర్యాదుదారుడి వివరాలను భద్రతా కారణాల రీత్యా గోప్యంగా ఉంచినట్లు ACB పేర్కొంది.
ప్రభుత్వ ఉద్యోగులు లంచం డిమాండ్ చేసినట్లయితే ప్రజలు ACB టోల్ ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు.
🖋️ రిపోర్టర్: మొహమ్మద్ సల్మాన్
📍 జగిత్యాల జిల్లా
📰 DNN NEWS ప్రతినిధి
🌐 DNN NEWS – ప్రజల గొంతుక

Comments 0