ఈద్గా మసీదు వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో పోలీస్ శాఖలో తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహించి, పదోన్నతి పొంది అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ఏఎస్ఐ)గా నియమితులైన అబ్దుల్ రషీద్‌ను అభినందిస్తూ సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
ఈద్గా మసీదు కాంప్లెక్స్‌లోని లైబ్రరీలో జరిగిన ఈ కార్యక్రమంలో అబ్దుల్ రషీద్‌కు పూలమాల వేసి, శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు ఆయనకు అభినందనలు తెలియజేస్తూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. పోలీస్ శాఖలో అబ్దుల్ రషీద్ మరింత ఉన్నత స్థాయికి ఎదిగి, మంచి సేవలు అందించాలని, జీవితంలో మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఈద్గా మసీదు వెల్ఫేర్ సొసైటీ సభ్యులు మహ్మద్ ఫసియుద్దీన్ సిద్ధిఖీ, అబ్దుల్ వహీద్, రిటైర్డ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అబ్దుల్ రహీం, రిటైర్డ్ హెడ్మాస్టర్ అబ్దుల్ రహీం, రిటైర్డ్ ఉపాధ్యాయుడు అబ్దుల్ లతీఫ్, యాసీన్, అబ్దుల్ రషీద్‌తో పాటు జామా మసీదు అధ్యక్షుడు మహ్మద్ మాసి తదితరులు పాల్గొన్నారు.
కోరుట్ల రిపోర్టర్ అబూబకర్ సిద్ధిఖీ
