అమ్మ మాట – అంగన్వాడి బాట బడి బాట… భవిష్యత్తు బాట
తేదీ: 15-06-2026
ఐసిడిఎస్ ప్రాజెక్టు జగిత్యాల అర్బన్-2 సెక్టార్ పరిధిలోని చింతకుంటవాడ అంగన్వాడీ కేంద్రంలో “అమ్మ మాట – అంగన్వాడీ బాట” కార్యక్రమాన్ని వార్డు కౌన్సిలర్ బడుగు పద్మ రాజేందర్ గారి అధ్యక్షతన, సూపర్వైజర్ మమత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా రెండున్నర సంవత్సరాల నుండి ఆరు సంవత్సరాల వయస్సు గల పిల్లలను అంగన్వాడీ కేంద్రాలలో చేర్పించాలని ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాల ప్రాముఖ్యతను తెలియజేస్తూ స్లోగన్స్ ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చారు.
అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలకు మంచి అలవాట్లు, కథలు, పాటలు, సృజనాత్మక కార్యక్రమాలు, మానసిక మరియు శారీరక అభివృద్ధి, మేధో వికాసం, భాషాభివృద్ధి జరుగుతాయని వివరించారు. అలాగే కేంద్రాలలో పరిశుభ్రత పాటించడం, అందంగా అలంకరించడం, పెరటి తోటల పెంపకం, పిల్లలకు స్నేహపూర్వక వాతావరణం కల్పించడం వంటి అంశాలపై తల్లులకు అవగాహన కల్పించారు.
“ఆటలు పాటలు – మెదస్సుకు బాటలు”, “అక్షరాల బాటలో అభ్యాసం”, “పోషణ ఆరోగ్యం – బలమైన భవిష్యత్తు” అనే నినాదాలతో కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ బడుగు పద్మ రాజేందర్ గారు, అంగన్వాడీ సూపర్వైజర్ మమత, వార్డు ఆఫీసర్ సంతోష్, ఆర్పి విమల, గర్భవతులు, బాలింతలు, తల్లులు, కిశోర బాలికలు, పిల్లలు మరియు అంగన్వాడీ టీచర్లు ఇంద్రజ, జ్యోతి, లక్ష్మి, రాధిక, కల్పన, సుధారాణి, గంగాభవాని పాల్గొన్నారు.
రిపోర్టర్: రియాజ్, జగిత్యాల

