సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడితే కఠిన చర్యలు
ప్లాస్టిక్ స్వాధీనం.. రూ.10 వేల జరిమానా విధింపు – కోరుట్ల మున్సిపల్ కమిషనర్ వి. రాఘవేంద్ర
📍 కోరుట్ల | జూన్ 13, 2026 | శనివారం | DNN NEWS
కోరుట్ల పట్టణంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని అరికట్టేందుకు మున్సిపల్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ వి. రాఘవేంద్ర ఆదేశాల మేరకు పట్టణంలోని టిఫిన్ సెంటర్లు, కిరాణా దుకాణాల్లో తనిఖీలు చేపట్టి సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను స్వాధీనం చేసుకుని రూ.10,000 జరిమానా విధించారు.

ఈ సందర్భంగా వ్యాపారులకు ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే పర్యావరణ నష్టాలపై అవగాహన కల్పించారు. అలాగే ట్రేడ్ లైసెన్స్ పునరుద్ధరణ చేయని దుకాణదారులకు వెంటనే లైసెన్స్ రెన్యువల్ చేసుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా కమిషనర్ వి. రాఘవేంద్ర మాట్లాడుతూ, సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను పూర్తిస్థాయిలో నిషేధించాల్సిందేనని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై భారీ జరిమానాలు విధించడంతో పాటు అవసరమైతే దుకాణాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు.
ట్రేడ్ లైసెన్స్ లేని వ్యాపారులు వెంటనే లైసెన్స్ పొందాలని సూచించిన ఆయన, వ్యాపార కార్యకలాపాల ద్వారా ఉత్పత్తి అయ్యే చెత్తను తడి, పొడి, హానికర చెత్తగా వేరు చేసి మున్సిపల్ వాహనాలకు అందించాలని తెలిపారు. లేనిపక్షంలో SWM-2026 నిబంధనల ప్రకారం జరిమానాలు విధించబడతాయని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో సానిటరీ ఇన్స్పెక్టర్ రాజేంద్రప్రసాద్, ఇన్చార్జ్ సానిటరీ ఇన్స్పెక్టర్ అశోక్, రికార్డ్ అసిస్టెంట్ జగదీష్, జవాన్లు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
🖋️ DNN NEWS రిపోర్టర్ ఎం.ఏ. జమీల్
📍 కోరుట్ల
🌐 DNN NEWS – ప్రజల గొంతుక
