📍 జగిత్యాల జిల్లా | జూన్ 15, 2026 | సోమవారం | DNN NEWS
ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా గ్రీవెన్స్ డే కార్యక్రమంలో భాగంగా జగిత్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్, ఐపీఎస్ ప్రజల నుండి వచ్చిన పలు ఫిర్యాదులను స్వయంగా పరిశీలించారు.
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు 13 మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు, ఫిర్యాదులను వివరంగా తెలుసుకున్నారు. ప్రతి ఫిర్యాదును శ్రద్ధగా విని, బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ, ప్రజల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదును న్యాయబద్ధంగా, పారదర్శకంగా విచారించి త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. చట్ట పరిధిలో పరిష్కరించగల సమస్యలను ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే పరిష్కరించాలని, విచారణ ప్రక్రియలో ఎలాంటి లోపాలు లేకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అధికారులకు స్పష్టం చేశారు.
ప్రజల సమస్యల పరిష్కారానికి పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని, బాధితులకు న్యాయం చేయడమే పోలీసుల ప్రధాన బాధ్యత అని ఎస్పీ పేర్కొన్నారు.
🖋️ DNN NEWS రిపోర్టర్ మొహమ్మద్ సల్మాన్
📍 జగిత్యాల జిల్లా
🌐 DNN NEWS – ప్రజల గొంతుక
