🛑 దుబాయ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. కోరుట్ల వాసి సహా 7 మంది మృతి
దుబాయ్‌లో ఎమిరేట్స్ రోడ్డుపై విషాదం.. శోకసంద్రంలో కోరుట్ల, మృతుల కుటుంబాలకు సహాయం అందిస్తాం: ఇండియన్ కాన్సులేట్
📍 కోరుట్ల | జూన్ 9 (మంగళవారం) | DNN NEWS
దుబాయ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కోరుట్లకు చెందిన వ్యక్తి సహా మొత్తం 7 మంది మృతి చెందగా, మరో 9 మంది గాయపడిన విషాద ఘటన చోటుచేసుకుంది.

సమాచారం ప్రకారం, దుబాయ్‌లోని ఎమిరేట్స్ రోడ్డుపై నిలిచి ఉన్న ఓ ట్రక్కును మినీ బస్సు వెనుక నుంచి బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాద తీవ్రతకు బస్సులో ప్రయాణిస్తున్న 7 మంది అక్కడికక్కడే మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.
మృతుల్లో జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన అబ్దుల్ రఫీక్, కరీంనగర్ జిల్లా నామిలిగొండకు చెందిన సయ్యద్ సలీమ్ ఉన్నట్లు సమాచారం. ప్రమాదంలో గాయపడిన 9 మందిని రెస్క్యూ సిబ్బంది అంబులెన్సుల ద్వారా సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ విషాద ఘటనపై స్పందించిన ఇండియన్ కాన్సులేట్ జనరల్, దుబాయ్, మృతుల కుటుంబాలకు మరియు గాయపడిన వారికి అవసరమైన అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చింది.
ఈ ఘటనతో కోరుట్ల ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
దుబాయ్ ఘటనపై ప్రత్యక్ష సమాచారం అందిస్తున్న DNN NEWS ప్రతినిధి అబూబకర్ సిద్ధిఖీ
🖋️ రిపోర్టర్: అబూబకర్ సిద్ధిఖీ
📍 కోరుట్ల
🌐 DNN NEWS – ప్రజల గొంతుక
