DNN న్యూస్ -ఏలూరు
ఏలూరు: గవరవరం ఏటిగట్టు మీద గల ఫ్రెండ్స్ ఆఫ్ గాడ్ చర్చ్ యువకులు మరియు ఉత్సాహవంతులైన సంఘ సభ్యులు అందరూ కలిసి ఈరోజు శాతవాహన నగర్ రోడ్డు జంక్షన్ వద్ద మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని పాస్టర్ ఎన్.ఎల్. పాల్ గారు మరియు సంఘ పెద్దలు M.ప్రసాద్ & P.రవి గారు ప్రారంభించారు.
మండుటెండల్లో ఉపశమనం కలిగించేందుకు, దాహంతో అలమటిస్తున్న బాటసారులు, వాహనదారులు, దినసరి కూలీలకు చల్లని మజ్జిగను అందించారు.

ఎండ వేడిమి నుండి రక్షణ కల్పించే ఉద్దేశంతో ప్రతి వేసవిలో ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఫ్రెండ్స్ ఆఫ్ గాడ్ చర్చ్ సభ్యులను స్థానికులు, ప్రయాణికులు అభినందించారు. అనేకమంది వాహనదారులు తమ వాహనాలను ఆపి, అక్కడ పంపిణీ చేసిన మజ్జిగను సేవించి తమ కృతజ్ఞతలు తెలిపారు.
చర్చి యువత చేస్తున్న ఈ మానవతా సేవను పలువురు ప్రశంసిస్తూ, ఇలాంటి కార్యక్రమాలు సమాజానికి ఎంతో అవసరమని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో చర్చి యువజన నాయకులు, సంఘ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని సేవలో సహకరించారు. —

రిపోర్టర్: DNN న్యూస్, ఏలూరు
