కోరుట్ల మే 10 (DNN) : జగిత్యాల జిల్లా
కోరుట్ల పట్టణంలోని గోదాం చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన ప్రయాణికుల ప్రాంగణంలో తామిరే మిల్లత్ ఇదారే దీన్ దోస్త్ ఆధ్వర్యంలో ఆదివారం చలివేంద్రాన్ని కోరుట్ల మున్సిపల్ మాజీ చైర్మన్ శీలం వేణుగోపాల్, మౌలానా కరీం. ప్రారంభించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు వార్డు కౌన్సిలర్ శీలం వేణుగోపాల్ మాట్లాడుతూ మైనారిటీ సోదరులు నిర్వహిస్తున్న ఈ చలివేంద్రం ప్రజలకు ఎంతో ఉపయోగకరమని అన్నారు ప్రతి పండుగ ప్రతి కార్యక్రమాన్ని అందరూ కలిసి మెలిసి నిర్వహించుకోవడం కోరుట్ల ప్రత్యేకత అని పేర్కొన్నారు
కార్యక్రమంలో బీఆర్ఎస్ కౌన్సిలర్ మహమ్మద్ వసీం. డాక్టర్ జాకీర్ హుస్సేన్. డాక్టర్ సలీం. మౌలానా ముజీబుర్ రహ్మాన్. మౌలానా ఆబిద్. డాక్టర్ భారీ.తో పాటు దీన్ దోస్త్ సభ్యులు స్థానికులు యువకులు తదితరులు పాల్గొన్నారు.
అబూబకర్ సిద్ధిఖీ

