DNN News కైకలూరు, Eluru. జూన్ 1, 2026:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, విద్య, ఐటీ మరియు మానవ వనరుల శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న “ఎన్టీఆర్ భరోసా పింఛన్ల” కార్యక్రమాన్ని కైకలూరు మండలంలో ఘనంగా నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రజా హామీల కమిటీ చైర్మన్, మాజీ మంత్రి, మాజీ శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారి మార్గదర్శకత్వంలో, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, కైకలూరు నియోజకవర్గ కన్వీనర్ వీరమల్లు నరసింహారావు గారి ఆధ్వర్యంలో సోమవారం కైకలూరు మండలంలో ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో కైకలూరు ఏఎంసీ చైర్మన్ త్రినాధరాజు గారు, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు మీ రాధాకృష్ణ గారు, మీసాల వెంకన్న స్వామి గారు, దేవస్థానం చైర్మన్ మోహన్ గారు, మండల వైస్ ఎంపీపీ మంగినేని రామకృష్ణ గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీటీసీ మెడికల్ షాప్ కృష్ణ గారు, ఏఎంసీ డైరెక్టర్ ఉస్మాన్ గారు, పట్టణ అధ్యక్షులు పడమటి వాసు గారు, శ్రీ శ్యామలాంబ ట్రస్ట్ బోర్డు డైరెక్టర్ రామస్వామి గారు, కనక లింగేశ్వర స్వామి ట్రస్ట్ బోర్డు డైరెక్టర్ కృష్ణవేణి గారు, సచివాలయ సిబ్బంది స్వప్న, మాధురి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ఎన్టీఆర్ భరోసా పింఛన్ల ద్వారా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు మరియు ఇతర అర్హులైన లబ్ధిదారులకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలు ప్రతి అర్హ కుటుంబానికి చేరేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.
