కొయ్యలగూడెంలో ఘనంగా వైఎస్సార్సీపీ ఎస్ఐఆర్ కార్యక్రమం – పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన నేతలు
DNN న్యూస్ డెస్క్, పోలవరం – ఏలూరు జిల్లా rతేదీ: 01 జూన్ 2026
ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం కొయ్యలగూడెం మండలంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, మాజీ శాసనసభ్యులు శ్రీ తెల్లం బాలరాజు గారి ఆధ్వర్యంలో ఎస్ఐఆర్ (Special Intensive Revision) కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు గారు, రాష్ట్ర నాయకులు కారుమూరి సునీల్ కుమార్ గారు, జిల్లా ఎస్ఐఆర్ టాస్క్ ఫోర్స్ ఇన్చార్జి పోతుల శివారెడ్డి గారు, మచిలీపట్నం పార్లమెంట్ పరిశీలకులు జెట్టి గురునాదరావు గారు, పోలవరం నియోజకవర్గ పరిశీలకులు కనుమూరి శివరామరాజు గారు, ఏలూరు జిల్లా ఎం.పి.పి ఛాంబర్ అధ్యక్షులు, పోలవరం ఎం.పి.పి సుంకర వెంకటరెడ్డి గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి, కార్యకర్తల సమన్వయానికి మరియు రాబోయే రాజకీయ కార్యక్రమాల విజయానికి ఎస్ఐఆర్ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. అలాగే పార్టీ శ్రేణులు ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడాలని, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పోలవరం నియోజకవర్గంలోని ఏడు మండలాల కన్వీనర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
