ఏడు మోటాలపల్లి వరిధాన్యం కొనుగోలు కేంద్రం విజయవంతంగా పూర్తి
రైతులకు అండగా నిలిచిన అధికారులకు, ప్రజాప్రతినిధులకు జీవన్ నాయక్ కృతజ్ఞతలు
పెగడపల్లి, |జూన్ 7 Sun|DNN న్యూస్:
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం ఏడుమోటాలపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రం విజయవంతంగా, సంపూర్ణంగా పూర్తయిందని AiBSSS (ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్) యువజన జగిత్యాల జిల్లా అధ్యక్షులు నగావత్ జీవన్ నాయక్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులు పండించిన ధాన్యాన్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేసి ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయడంలో సహకరించిన రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం, వ్యవసాయ శాఖ అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ముఖ్యంగా రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, అదనపు కలెక్టర్ రాజా గౌడ్, ఆర్డీవో మధుసూదన్, డీసీఓ మనోజ్, మండల రెవెన్యూ అధికారులు, ఆర్ఐ, పెగడపల్లి మండల ప్రజాప్రతినిధులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ప్రతినిధులు, వ్యవసాయ మార్కెట్ పాలకవర్గ సభ్యులు, వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, సీఈఓ గోపాల్, స్పెషల్ ఆఫీసర్ మల్లేశం తదితరులకు రైతుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయడం వల్లే కొనుగోలు ప్రక్రియ సాఫీగా పూర్తైందని జీవన్ నాయక్ పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా రైతుల సమస్యల పరిష్కారానికి అందరూ ఇదే విధంగా సహకరించాలని కోరారు.
🖋️ రిపోర్టర్: జీవన్ నాయక్
📍 పెగడపల్లి, పెగడపల్లి మండలం, జగిత్యాల జిల్లా
🌐 DNN NEWS – ప్రజల గొంతుక

