DNN WORLD NEWS ఏలూరు
ఏలూరు, మే 10: కల్వరి ఫెలోషిప్ చర్చ్ లో ఈరోజు మదర్స్ డే వేడుకలు భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో ఘనంగా జరిగాయి.
చర్చి. శ్రీమతి చీమల పద్మ గారు మదర్స్ డే ప్రత్యేక సందేశాన్ని అందించారు. తల్లుల త్యాగం, ప్రార్థనా జీవితం, కుటుంబంలో వారి పాత్ర గురించి బైబిల్ వెలుగులో వివరించారు.
ఈ కార్యక్రమంలో పాస్టరమ్మగారు శ్రీమతి చీమల పద్మ గారు తల్లులందరికీ ప్రత్యేక ప్రార్థనలు చేసినారు.
సంఘ పెద్దలు గంగమ్మ గారు, రామేశ్వరమ్మ గారు తల్లులను ఘనంగా అభినందించి, వారి సేవలను కొనియాడారు. చర్చి సభ్యులందరూ కలిసి తమ తల్లులకు కృతజ్ఞతలు తెలుపుతూ పాటలు, సాక్ష్యాలు పంచుకున్నారు.

మదర్స్ డే సందర్భంగా చర్చి ప్రాంగణం పూలతో అలంకరించబడి, తల్లులందరికీ చిన్న బహుమతులు అందజేయడం విశేషంగా నిలిచింది.
ఈ వేడుకల్లో చర్చి పాస్టర్ రెవ. చీమల విక్టర్ పాల్ గారు సంఘ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ తల్లులను స్మరించుకుని దేవునికి కృతజ్ఞతలు తెలిపారు
రిపోర్టర్: DNN వరల్డ్ న్యూస్ టీం
