కామవరపుకోట, మే 11 (DNN క్రైమ్ న్యూస్):
ఏలూరు జిల్లా కామవరపుకోట పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సై వల్లీ పద్మ తన సిబ్బందితో కలిసి నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో ఇద్దరు గంజాయి విక్రేతలను అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఆదివారం సాయంత్రం కామవరపుకోట గ్రామ పరిధిలో ముమ్మర పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా, అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఆపి సోదా చేయగా వారి వద్ద గంజాయి లభ్యమైంది.
స్వాధీనం చేసుకున్నవి:
గంజాయి – 2.5 కిలోలు
నగదు – రూ. 900/-
సెల్ ఫోన్లు – 2
నిందితులపై NDPS చట్టం కింద కేసు నమోదు చేసి, విచారణ అనంతరం కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్సై వల్లీ పద్మ తెలిపారు.
ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, “మత్తు పదార్థాల విక్రయం, రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నాం. యువతను చెడు వ్యసనాలకు గురిచేసే వారిపై కఠిన చర్యలు తప్పవు. ప్రజలు ఇటువంటి సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలి,” అని హెచ్చరించారు.
– కామవరపుకోట పోలీస్ DNN క్రైమ్ న్యూస్ ఏలూరు.
