బొర్రంపాలెం గ్రామం ఎస్సీ కాలనీలో ఉన్న ప్రాథమిక పాఠశాల-1లో గత ప్రభుత్వ హయాంలో జరిగిన నాడు-నేడు పనులపై SSA EO జగ్గారావు మంగళవారం విచారణ చేపట్టారు.
గత ప్రభుత్వ పాలనలో పాఠశాల అభివృద్ధి కోసం సుమారు రూ.12,89,398 నిధులు మంజూరు చేసింది. ఆ నిధుల ఖర్చులో భారీగా అక్రమాలు జరిగాయని, నిధులు దుర్వినియోగం అయ్యాయని గ్రామానికి చెందిన సామాజిక వేత్త గుండె పాండురంగ ఇటీవల ప్రజాసమస్యల పరిష్కార వేదిక ద్వారా ఏలూరు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు.
ఆ ఫిర్యాదుపై ఉన్నతాధికారులు స్పందించడంతో మంగళవారం EO జగ్గారావు పాఠశాలను సందర్శించి క్షేత్రస్థాయిలో విచారణ జరిపారు.
అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ – పాఠశాల పనుల్లో జరిగిన వ్యత్యాసాలపై పూర్తిస్థాయిలో విచారణ చేపడతామని, విచారణ నివేదికను సిద్ధం చేసి త్వరలో జిల్లా కలెక్టర్కు సమర్పిస్తామని తెలిపారు. బాధ్యులపై నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయన్నారు.
విచారణలో పాఠశాల సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొన్నారు.
for DNN న్యూస్ డెస్క్ ఏలూరు
