రెండు సంవత్సరాల పాలన సందర్భంగా ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్న చింతలపూడి ఎమ్మెల్యే చిర్రి బాలరాజు.
రెండు సంవత్సరాల పాలన సందర్భంగా ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్న చింతలపూడి ఎమ్మెల్యే చిర్రి బాలరాజు.
జీలుగుమిల్లి, జూన్ 5 |DNN News|:
కూటమి ప్రభుత్వం రెండు సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చింతలపూడి ఎమ్మెల్యే చిర్రి బాలరాజు తెలిపారు.
ప్రజలు అందించిన విశ్వాసం, సహకారంతోనే ప్రభుత్వం విజయవంతంగా పాలన సాగించగలిగిందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ముందుకు సాగుతున్నాయని అన్నారు.
విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధి రంగాలకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. పోలవరం నిర్మాణం, మౌలిక వసతుల అభివృద్ధి, గ్రామీణ ప్రాంతాల పురోగతికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు.
ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని, గత రెండేళ్లలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా అమలు చేసినట్లు పేర్కొన్నారు.
రానున్న రోజుల్లో మరింత వేగంగా అభివృద్ధి పనులు చేపట్టి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సేవలు అందించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే చిర్రి బాలరాజు స్పష్టం చేశారు.
🖋️ రిపోర్టర్: DNN NEWS ప్రతినిధి
📍 జీలుగుమిల్లి, ఏలూరు జిల్లా
🌐 DNN NEWS – ప్రజల గొంతుక
