సైదాపూర్‌లో అవినీతిపై ఉక్కుపాదం,లంచం తీసుకుంటూ సర్వేయర్ అరెస్ట్"
సైదాపూర్‌లో అవినీతిపై ఉక్కుపాదం,లంచం తీసుకుంటూ సర్వేయర్ అరెస్ట్"
కరీంనగర్ జిల్లా:
కరీంనగర్ జిల్లాలో అవినీతిపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఉక్కుపాదం మోపారు. సైదాపూర్ మండల సర్వేయర్ ఎక్కాల్ దేవి కుమారస్వామి భూ సర్వే నిర్వహించేందుకు రూ.25 వేల లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు ఉచ్చుపన్ని పట్టుకున్నారు.
ఫిర్యాదు ఆధారంగా విచారణ చేపట్టిన ఏసీబీ అధికారులు, సర్వేయర్ తన ప్రైవేట్ సహాయకులు రాజేష్ మరియు విహిత్ రెడ్డి ద్వారా లంచం డబ్బులు స్వీకరిస్తున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో చివరి విడతగా రూ.10 వేలు తీసుకుంటుండగా ముగ్గురినీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్ట్ చేశారు.
నిందితుల వద్ద నుంచి లంచం నగదును స్వాధీనం చేసుకున్న అధికారులు, కేసు నమోదు చేసి తదుపరి విచారణ చేపట్టినట్లు సమాచారం. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.
🖋️ రిపోర్టర్: మొహమ్మద్ సల్మాన్
📍సైదాపూర్, కరీంనగర్ జిల్లా
🌐 DNN NEWS – ప్రజల గొంతుక
