బీజేపీ బీసీ సంక్షేమానికి పెద్దపీట — మోడీ సుపరిపాలనతో ఓబీసీలకు న్యాయం
మోడీ పాలనలో బీసీలకు రాజకీయ, ఆర్థిక, సామాజిక సాధికారత – OBC మోర్చా సన్నాహక సమావేశంలో నేతల వ్యాఖ్యలు
జగిత్యాల, |జూన్ 7 Sun|DNN న్యూస్:
గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి 12 సంవత్సరాల సుపరిపాలన సందర్భంగా భారతీయ జనతా పార్టీ OBC మోర్చా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “సుపరిపాలన దినోత్సవాలు” కార్యక్రమంలో భాగంగా ఆదివారం జగిత్యాల జిల్లా కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి OBC మోర్చా రాష్ట్ర కార్యదర్శి ఆడిచర్ల రాజు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, బీజేపీ ప్రభుత్వం ఎల్లప్పుడూ బీసీ వర్గాల అభ్యున్నతికి కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో బీసీలకు రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాలలో సముచిత ప్రాధాన్యత లభించిందన్నారు.
దేశ చరిత్రలో తొలిసారిగా బీసీ వర్గాలకు అధిక ప్రాతినిధ్యం, సంక్షేమ పథకాలు, స్వయం ఉపాధి అవకాశాలు కల్పించిన ఘనత బీజేపీ ప్రభుత్వానిదేనని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు బీసీ వర్గాల సాధికారతకు దోహదపడుతున్నాయని వివరించారు.
ఈ కార్యక్రమంలో జగిత్యాల నియోజకవర్గ కన్వీనర్ కాశెట్టి తిరుపతి, జగిత్యాల పట్టణ ఇంచార్జ్ గాదాసు రాజేందర్, జగిత్యాల రూరల్ ఇంచార్జ్ బోగ నరేష్, ఇట్యాల రాము, ముద్దం నాగరాజు, శ్రీకాంత్ తదితర నాయకులు పాల్గొన్నారు.
🖋️ రిపోర్టర్: సురేష్ సుంచు
📍 జగిత్యాల జిల్లా
🌐 DNN NEWS – ప్రజల గొంతుక
