దెందులూరు బాలసదన్‌లో విద్యార్థినులతో ముఖాముఖి నిర్వహించి అవగాహన కల్పిస్తున్న ఏలూరు జిల్లా ఎస్పీ కే. ప్రతాప్ శివ కిశోర్.
దెందులూరు బాలసదన్‌లో విద్యార్థినులతో ముఖాముఖి నిర్వహించి అవగాహన కల్పిస్తున్న ఏలూరు జిల్లా ఎస్పీ కే. ప్రతాప్ శివ కిశోర్.
దెందులూరు, |జూన్ 7 Sun| DNN న్యూస్:
బాలికలు తమకు ఎదురయ్యే సమస్యలను దాచుకోకుండా నిర్భయంగా పోలీసులతో పంచుకోవాలని ఏలూరు జిల్లా ఎస్పీ కే. ప్రతాప్ శివ కిశోర్ సూచించారు. దెందులూరు బాలసదన్ విద్యార్థినులతో శనివారం నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొని విద్యార్థినులతో ఆత్మీయంగా మాట్లాడారు.
ఈ సందర్భంగా బాలికల విద్య, భద్రత, వ్యక్తిత్వ వికాసం, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. సమస్యలు ఎదురైనప్పుడు భయపడకుండా వెంటనే పోలీసులను ఆశ్రయించాలని, అత్యవసర పరిస్థితుల్లో డయల్-112 సేవలను వినియోగించుకోవాలని సూచించారు.
విద్యార్థినుల సందేహాలకు సమాధానాలు ఇస్తూ, వారి అభిరుచులు, లక్ష్యాలు తెలుసుకున్నారు. బాలికలతో కలిసి సరదాగా గడుపుతూ వారి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేలా ప్రోత్సహించారు.

ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, బాలసదన్ సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు. ఎస్పీ సందర్శన పట్ల విద్యార్థినులు ఆనందం వ్యక్తం చేశారు.
🖋️ రిపోర్టర్: DNN న్యూస్ రిపోర్టర్
📍 దెందులూరు, ఏలూరు జిల్లా
🌐 DNN NEWS – ప్రజల గొంతుక
