అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిన సమీకృత కూరగాయల మార్కెట్‌ను వెంటనే ప్రారంభించాలి
మున్సిపల్ కార్యాలయం ముందు బీజేపీ ధర్నా – అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం
📍 మెట్పల్లి | జూన్ 9, 2026 | మంగళవారం | DNN NEWS
మెట్పల్లి పట్టణంలోని సమీకృత కూరగాయల మార్కెట్ అభివృద్ధి పనులను పూర్తి చేసి వెంటనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మెట్పల్లి పట్టణ శాఖ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి బీజేపీ పట్టణ అధ్యక్షుడు ధోనికెల నవీన్ నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమీకృత కూరగాయల మార్కెట్ నిర్మాణ పనులు నిలిచిపోవడంతో రైతులు, వ్యాపారులు రహదారుల పక్కనే కూరగాయల విక్రయాలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
దీంతో ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా పెరిగి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తరచూ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మార్కెట్ నిర్మాణం పూర్తై సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు ప్రారంభించకపోవడం వెనుక కారణాలను అధికారులు వెల్లడించాలని డిమాండ్ చేశారు.
మార్కెట్ ప్రాంగణం ప్రస్తుతం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని ఆరోపించిన ఆయన, రోడ్లపైనే వ్యాపారాలు కొనసాగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు.
నిలిచిపోయిన అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేసి సమీకృత కూరగాయల మార్కెట్‌ను ప్రారంభించాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ధర్మపురి స్వరూప వేణుగోపాల్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ బొడ్ల ఆనంద్, కౌన్సిలర్లు కోయల్కర్ స్రవంతి లింగేశ్వర్, బొడ్ల వసుధ నాగేష్తో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
🖋️ DNN NEWS ప్రతినిధి సురేష్ సుంచు
📍 మెట్పల్లి, కోరుట్ల
🌐 DNN NEWS – ప్రజల గొంతుక
