ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వార్డు సభలు
సీజనల్ వ్యాధుల నివారణ, పరిశుభ్రత, డ్రగ్స్ నిర్మూలనపై ప్రజలకు అవగాహన,ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో వార్డు సభలు
📍 జగిత్యాల | జూన్ 12, 2026 | శుక్రవారం | DNN NEWS
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా జగిత్యాల పట్టణంలోని తీన్ ఖని సమీపంలోని శివాజీ ఫంక్షన్ హాల్లో 32, 33, 34 వార్డులకు సంబంధించిన వార్డు సభను నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ సమిండ్ల వాణి, మున్సిపల్ కమిషనర్, జగిత్యాల టౌన్ సీఐ కరుణాకర్, 32వ వార్డు కౌన్సిలర్ డా. అయ్యుబ్ ఖాన్, వార్డు అధికారులు మరియు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయా వార్డులకు చెందిన అర్హ మహిళలకు ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు.
అనంతరం నిర్వహించిన సభలో ప్రజలకు వర్షాకాలంలో ప్రబలే సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి మున్సిపల్ వాహనాలకు అందించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా, వాంతులు, విరేచనాలు వంటి వ్యాధులను నివారించవచ్చని వివరించారు.
అలాగే డ్రగ్స్ నిర్మూలనపై ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసి, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
వార్డు అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలు, మౌలిక సదుపాయాల మెరుగుదలపై కూడా ఈ సభలో చర్చించారు. ప్రతి ఇంటి వద్ద కనీసం ఒక మొక్కను నాటి పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వార్డు ప్రజలు పాల్గొని సభను విజయవంతం చేశారు.
🖋️ DNN NEWS రిపోర్టర్ మొహమ్మద్ సల్మాన్
📍 జగిత్యాల జిల్లా
🌐 DNN NEWS – ప్రజల గొంతుక :::
