ఇది పోలవరం ప్రభుత్వ జూనియర్ కళాశాల లో ఇంటర్ ఫెయిలైన విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక రిమెడియల్ శిక్షణ. ఐపీఎంసీ 2026 పరీక్షల్లో ఉత్తీర్ణతే లక్ష్యంగా కాలేజీ యాజమాన్యం తీసుకుంటున్న చర్యలను ప్రిన్సిపల్ సజని వివరించారు.
ఫలితాలపై: “ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కంటే ఫలితాలు బాగున్నాయి. అనుసరించి విద్యార్థుల సంఖ్య కూడా పెరిగింది.”
ఎంపీసీ స్టూడెంట్స్: గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది ఎంపీసీ స్టూడెంట్స్ కాలేజీ టాపర్స్‌గా నిలిచారు. మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్, హిస్టరీలో 90% పైగా ఉత్తీర్ణత సాధించారు.
ఫెయిల్ విద్యార్థులకు సలహా: “రోజూ కాలేజీకి క్రమం తప్పకుండా హాజరైతే, కాలేజీలో బోధించిన పాఠాలను కచ్చితంగా ఇంటి వద్ద అభ్యసించుకోవాలి. తిరిగి ఇంటి వద్ద కూడా అదే సబ్జెక్టుకు కొంత సమయం కేటాయించి చదువుకోవాలి.”
తల్లిదండ్రులకు: “ప్రతి సబ్జెక్ట్‌ను ఏ విధంగా చదివించాలో విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నాం.”
ప్రశ్న-జవాబు ఫార్మాట్: విద్యార్థుల కోసం తీసుకున్న చర్యలపై ప్రిన్సిపల్‌తో “చిట్ చాట్” చేసిన DNN న్యూస్ డెస్క్ వెబ్సైట్: www.DNN WORLD.com
DNN world epaper పోలవరం
రిపోర్టర్: కిరణ్ కుమార్ పాలూరి
