స్థానిక విద్యానగర్లోని కార్యాలయంలో సమావేశమైన భారత్ సురక్ష సమితి నాయకులు హిందూ బంధువులకు, భక్తులకు, హనుమాన్ స్వామీజీలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ కౌన్సిలర్ ఏసిఎస్ రాజు మాట్లాడుతూ హనుమంతుడు బలం, భక్తి, సేవ, ధైర్యానికి ప్రతీక అని అన్నారు. నేటి యువత హనుమంతుడిని ఆదర్శంగా తీసుకుని దేశభక్తి, సమాజ సేవా భావాలను అలవర్చుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో 22వ వార్డు కౌన్సిలర్ అరవ లక్ష్మి, అక్కినపల్లి కాశీనాదం, చిట్ల గంగాధర్, వేముల పోచమల్లు, సింగం గంగాధర్, కె.ఆర్. కృష్ణ, బాశెట్టి దుబ్బరాజం, సిరిపురం గంగారం, నరేందుల శ్రీనివాస్, కొత్తకొండ బాలన్న తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.
రిపోర్టర్ సురేష్ సుంచు
