కృష్ణా జిల్లా చెస్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక
కృష్ణా జిల్లా చెస్ అసోసియేషన్ విజయవాడ, 12 మే 2026
కృష్ణా జిల్లా చెస్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నికలు 11 మే 2026న పోరంకిలోని జిల్లా సంఘ కార్యాలయంలో జయప్రదంగా నిర్వహించబడ్డాయి. ఎన్ఎస్ఎస్-2011 నిబంధనలు మరియు ఆంధ్రప్రదేశ్ చెస్ అసోసియేషన్ జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ ఎన్నికలు జరిగాయి.
ఎన్నికల పరిశీలకులుగా ఆంధ్ర చెస్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి శ్రీ ఎండి అక్తర్ పాషా వ్యవహరించారు.
నూతనంగా ఎన్నికైన కార్యవర్గం:
అధ్యక్షులు – శ్రీ నిమ్మగడ్డ రాజా, గుడివాడ
ప్రధాన కార్యదర్శి – శ్రీమతి ఎం.ఎన్.ఎల్.వి. దివ్య, పామర్రు
కోశాధికారి – శ్రీమతి కె. ఈశ్వరి, మచిలీపట్నం
ఉపాధ్యక్షులు – శ్రీ జి. కాశీవిశ్వనాథ్, మచిలీపట్నం
సంయుక్త కార్యదర్శి – శ్రీ పెదపాటి చంద్రశేఖర్, పోరంకి
కార్యవర్గ సభ్యులు – శ్రీ చిలకల శ్రీనివాస్ గుప్తా, ఉయ్యూరు; శ్రీ సోము సుధీర్ బాబు, గన్నవరం
ఈ కమిటీ మూడేళ్ల పాటు పనిచేస్తుంది. జిల్లా వ్యాప్తంగా పాఠశాలల్లో చెస్ ప్రోత్సాహం, రేటింగ్ టోర్నమెంట్ల నిర్వహణ, గ్రామీణ ప్రతిభావంతులకు శిక్షణ ఇవ్వడం తమ ప్రాధాన్యతలని నూతన అధ్యక్షులు తెలిపారు.
నూతన కార్యవర్గానికి ఆంధ్ర చెస్ అసోసియేషన్ చైర్మన్ శ్రీ కె.వి.వి. శర్మ, అధ్యక్షులు శ్రీ అడుసుమిల్లి సురేష్, కార్యదర్శి శ్రీ జగదీష్ హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.
ఇట్లు
కార్యదర్శి
ఎం.ఎన్.ఎల్.వి. దివ్య
కృష్ణా జిల్లా చెస్ అసోసియేషన్, పోరంకి
For: DNN SPORTS NEWS Krishna
