ఐఐటీ శిక్షణకు కోర్సుకు ఎంపిక అయినా సాందరి కారి లహరి
DNN తెలుగు డిజిటల్ న్యూస్, ధర్మపురి 03-06-2026
జగిత్యాల జిల్లాలోని జగిత్యాల పట్టణ కేంద్రంలో గల స్థానిక ఆల్ఫోర్స్ బాలికల జూనియర్ కళాశాల యందు ఇంటర్మీడియట్ విద్యాను అభ్యాసించిన సాందరి కారి లహరి అనే విద్యార్థిని ఐఐటీలో ఎస్సీ విభాగం 362 ర్యాంకుతో ప్రీపరేటరీ క్రింద 2026 – 2027 విద్యా సంవత్సరం నందు ఏడాది పాటు ఏదైనా ఒక ఐఐటీలో శిక్షణ ఇచ్చి 2027 – 2028 విద్యా సంవత్సరం యందు బీటెక్ కళాశాల లలో ప్రవేశం కల్పిస్తారని ఆల్ఫోర్స్ కళాశాల ప్రిన్సిపాల్ పాలకుర్తి రజని బుధవారం రోజు మధ్యాహ్నం వేళలో మీడియాతో మాట్లాడుతూ.. ఇట్టి శిక్షణ ద్వారా జేఈఈ మెయిన్స్ నందు అర్హత సాధించి ఐఐటీలు, ఇతర విద్యా సంస్థ లలో సీట్లు సాధిస్తారు అని వారు మీడియాతో పేర్కోన్నారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్, ఐఐటీ, తెలంగాణ ఏప్ సెట్, ఇతర పోటీ పరీక్షలలో రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన సాందరి కారి లహరితో పాటు ఆమె తల్లిదండ్రులు అయినా ఉమా సురేష్ – దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆల్ఫోర్స్ విద్యా సంస్థల నుండి తమ అభినందనలను తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో వారితో పాటు, కళాశాల భోదన సిబ్బంది, కళాశాల సిబ్బంది, తల్లిదండ్రులు, విద్యార్థిని విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
~ జర్నలిస్ట్ జైషేట్టి రాకేష్ – ధర్మపురి టౌన్ జగిత్యాల జిల్లా


Great work! Keep going. Congratulations, and wishing you all the best for a successful future.