తెలంగాణకు మోదీ భారీ కానుక – రూ.7,597 కోట్లతో రెండు జాతీయ రహదారుల విస్తరణకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం
ప్రధాని నరేంద్ర మోదీ, ఎంపీ ధర్మపురి అరవింద్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన బీజేపీ నేతలు
మెట్‌పెల్లి , జూన్ 4, 2026
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మరో భారీ కానుక అందించింది. ₹7,597 కోట్ల భారీ నిధులతో రాష్ట్రంలోని కీలక జాతీయ రహదారుల విస్తరణకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
✅ కరీంనగర్ – జగిత్యాల
✅ ఆర్మూర్ – జగిత్యాల – మంచిర్యాల
మార్గాలను నాలుగు లైన్ల జాతీయ రహదారులుగా అభివృద్ధి చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రాజెక్టులతో వేగవంతమైన రవాణా, పారిశ్రామిక అభివృద్ధి, రైతులు మరియు వ్యాపారులకు మెరుగైన అనుసంధానం ఏర్పడి తెలంగాణ ఆర్థిక ప్రగతికి మరింత బలం చేకూరనుంది.
ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ మెట్పల్లి పట్టణ శాఖ ఆధ్వర్యంలో మెట్పల్లి పాత బస్టాండ్ వద్ద ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ , నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ ధర్మపురి అరవింద్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ జగిత్యాల జిల్లా అధ్యక్షులు డాక్టర్ రాచకొండ యాదగిరి బాబు , బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ అనూప్ రావు హాజరయ్యారు.
ఈ సందర్భంగా బీజేపీ మెట్పల్లి పట్టణ అధ్యక్షుడు ధోనీకెల నవీన్ మాట్లాడుతూ తెలంగాణ జాతీయ రహదారుల అభివృద్ధికి ఎంపీ ధర్మపురి అరవింద్ కృషితో కేంద్రం భారీ నిధులు మంజూరు చేసిందన్నారు. ఎన్‌హెచ్-63 ఆర్మూర్ – జగిత్యాల – మంచిర్యాల ఫోర్‌లైన్ విస్తరణకు, అలాగే ఎన్‌హెచ్-563 జగిత్యాల – కరీంనగర్ ఫోర్‌లైన్ విస్తరణకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపడం తెలంగాణ అభివృద్ధికి కీలకమని పేర్కొన్నారు.
జగిత్యాల జిల్లా అభివృద్ధి విషయంలో ఎంపీ ధర్మపురి అరవింద్ కృషిని ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని, కేంద్రం నుంచి వేల కోట్ల రూపాయల నిధులు తీసుకువచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వడ్డేపల్లి శ్రీనివాస్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ధర్మపురి స్వరూప వేణుగోపాల్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ బొడ్ల ఆనంద్, కౌన్సిలర్లు బొడ్ల వసుధ నాగేష్, దివ్య కిషోర్, స్రవంతి లింగేశ్వర్, అరిగెల అనూష రాకేష్, బీజేపీ సీనియర్ నాయకులు గుంటుక సదాశివ్, జుంగుల అనిల్ గౌడ్, బత్తుల జగదీశ్వర్, తోకల సత్యనారాయణ, తల్లోజి భాస్కర్, ఇల్లెందుల శ్రీనివాస్, బత్తిని శంకర్ గౌడ్, కొయ్యల లక్ష్మణ్, మధ్యల లావణ్య, దండిగా రజిని, ముక్క నరేష్, మంత్రి అంజయ్య, సుంకి అశోక్, దండిగ నరసయ్య, తారి భూమరెడ్డి, గుండవేని శేఖర్, అరిగెల అజయ్, శ్రీనివాస్, సంకు ప్రసాద్, తిరుచుల్ల అర్జున్, రఘుపతి, చర్లపల్లి హనుమాన్లు గౌడ్, గుండు మోహన్, గుండు ప్రభాకర్, చెరుకు రవీందర్, బాజిరెడ్డి మోహన్, మహేందర్, గుంటుక హనుమాన్లు తదితరులు పాల్గొన్నారు.
~ సురేష్ సుంచు




