హెల్మెట్ తనిఖీల్లో భాగంగా ద్విచక్ర వాహనదారులకు సూచనలు ఇస్తున్న పోలీసులు.
హెల్మెట్ తనిఖీల్లో భాగంగా ద్విచక్ర వాహనదారులకు సూచనలు ఇస్తున్న పోలీసులు.
పోలవరం, జూన్ 5 | DNN News| :
ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి, తమ ప్రాణాలకు రక్షణ కల్పించుకోవాలని ఏలూరు జిల్లా ఎస్పీ పి. అశోక్ కుమార్ సూచించారు.
ఆయన ఆదేశాల మేరకు గురువారం మండలంలోని పలు ప్రధాన కూడళ్లు, రహదారుల వద్ద పోలీసులు హెల్మెట్ వినియోగంపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనదారులను ఆపి, రహదారి భద్రతపై అవగాహన కల్పించారు.
ప్రతి ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్‌ను ఒక భారంగా కాకుండా రక్షణ కవచంగా భావించి ధరించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణనష్టం జరగకుండా, తీవ్ర గాయాల పాలుకాకుండా హెల్మెట్ ఎంతోగానో కాపాడుతుందని తెలిపారు.
ప్రజల భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యమని పేర్కొన్న ఎస్పీ, ట్రాఫిక్ నిబంధనలను ప్రతి ఒక్కరూ బాధ్యతగా పాటించాలని కోరారు. నిబంధనలను ఉల్లంఘించి నిర్లక్ష్యంగా వాహనాలు నడిపేవారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ ప్రత్యేక తనిఖీ కార్యక్రమంలో పోలీసులు విస్తృతంగా హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పించి, కానిస్టేబుళ్లు పలు సందేశాలతో ప్రజలను చైతన్యపరిచారు.
🖋️ రిపోర్టర్: DNN NEWS ప్రతినిధి
📍 పోలవరం, ఏలూరు జిల్లా
🌐 DNN NEWS – ప్రజల గొంతుక
